Vijay Devarakonda | సంక్రాంతి సీజన్ తెలుగు సినిమాకు ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే దర్శక నిర్మాతలు, హీరోలు ఆ సీజన్‌ను అంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంటారు. ఎలాగైనా సరే పండక్కి రావాలని కనీసం ఆరు నెలల ముందు నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. ఈసారి కూడా అదే జరుగుతుంది. 2024 సంక్రాంతి ఇంకా ఆరు నెలలు ఉండగానే ఇప్పటినుంచే ఒక్కొక్కరు స్లాట్స్ కన్ఫర్మ్ చేసుకుంటున్నారు. ఎంతమంది వస్తారో తెలియదు కానీ.. ప్రస్తుతానికి సంక్రాంతి బరిలో ఏకంగా అరడజన్ మంది హీరోలన్నారు. పైగా అందరూ స్టార్ హీరోలే కావడం గమనార్హం.
మహేశ్ బాబు గుంటూరు కారం జనవరి 13న విడుదల కానుంది. దానికి ఒక్కరోజు ముందు జనవరి 12న ప్రభాస్ ప్రాజెక్టు కే రాబోతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ అనుకున్నాం అంత వేగంగా జరగడం లేదు. పైగా పోస్ట్ ప్రొడక్షన్ కోసం కూడా టైం చాలా కావాలి. అందుకే మరో ఆరు నెలలు సినిమాను పోస్ట్ పోన్ చేయాలని చూస్తున్నారు దర్శక నిర్మాతలు. కాస్త నిదానంగా అయినా పర్లేదు కానీ మంచి అవుట్‌పుట్‌తో రావాలనేది మేకర్స్ ఆలోచన. దాంతో పండగ బరి నుంచి ప్రభాస్ టెన్షన్ మిగిలిన హీరోలకు తగ్గినట్టే. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ సినిమా కూడా సంక్రాంతికి రావడం కష్టమే. రాజకీయాలతో ఈయన బిజీగా ఉండటంతో షూటింగ్ అనుకున్నంత వేగంగా జరగడం లేదు. దాంతో పండగ బరిలో పవన్ కళ్యాణ్ రావడం దాదాపు అసాధ్యం. అంటే ఈయన టెన్షన్ కూడా మిగిలిన హీరోలకు లేదు. తమ్ముడు రాకపోయినా అన్నయ్య చిరంజీవి కచ్చితంగా ఒక సినిమాను పండక్కి తీసుకురావాలని ఆలోచిస్తున్నాడు.
మరోవైపు బాలకృష్ణ, బాబీ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానుందని తెలుస్తోంది. రవితేజ ఈగల్ కూడా పండక్కి రాబోతుంది. ఇన్ని సినిమాలు ఉండగా విజయ్ దేవరకొండ కూడా సంక్రాంతి బరిలో దిగాలని ఆలోచిస్తున్నాడు. ఇప్పటి వరకు అనౌన్స్ చేసిన సినిమాల్లో సగానికి పైగా కచ్చితంగా రావని విజయ్ దేవరకొండకు కూడా బాగా తెలుసు. అందుకే పండుగ సీజన్ వదలకూడదని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో వస్తున్న సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తున్నారు మేకర్స్. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో తీసుకొస్తుంది. ఒకవేళ విజయ్ కూడా వస్తే అన్ని సినిమాలకు థియేటర్స్ ఎక్కడ సరిపోతాయనేది అందరిలోనూ ఉన్న టెన్షన్. దీనికి సమాధానం కాలమే చెప్తుంది.
Dhoomam | ఫహద్ ఫాసిల్ ధూమం తెలుగులో రిలీజ్ కావడం లేదా..?