Dhoomam | ఫహద్ ఫాసిల్ ధూమం తెలుగులో రిలీజ్ కావడం లేదా..?
Dhoomam | మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil) నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ధూమం(Dhoomam). ఈ చిత్రం మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందన్న వార్త కూడా వచ్చింది.
Dhoomam | పుష్ప.. ది రైజ్‌తో తెలుగులో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ (Fahadh Faasil). ఈ స్టార్ యాక్టర్ నటిస్తోన్న లేటెస్ట్ ప్రాజెక్ట్ ధూమం (Dhoomam) పాన్ ఇండియా కథాంశంతో వస్తుందని ఇప్పటికే అప్డేట్ అందించారు మేకర్స్. ఈ చిత్రం మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుందన్న వార్త కూడా వచ్చింది. అయితే తాజాగా ఓ గాసిప్ ఇండస్ట్రీ సర్కిల్ లో రౌండప్ చేస్తోంది. ప్రస్తుతానికి ధూమం తెలుగు వెర్షన్ విడుదల కావడం లేదట.
మొదట మలయాళ వెర్షన్ రిలీజ్ చేసిన తర్వాత.. సినిమాకు వచ్చిన సక్సెస్ టాక్‌ను బట్టి ఇతర భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు న్యూస్ హల్ చల్ చేస్తోంది. మలయాళ వెర్షన్ రిలీజయ్యాక వారం తర్వాత మిగితా భాషల్లో తీసుకురావాలని అనుకుంటున్నారని టాక్. ప్రస్తుతం హైదరాబాద్‌తోపాటు ఇతర పట్టణాల్లో కేవలం మలయాళ వెర్షన్ బుకింగ్స్ మాత్రమే అందుబాటులో ఉంచారట మేకర్స్. ధూమం విడుదలపై తాజా వార్తలకు సంబంధించి మేకర్స్ ఏదైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలంటున్నారు మూవీ లవర్స్.
కేజీఎఫ్ లాంటి హిట్ ప్రాంచైజీని అందించిన అగ్ర చిత్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ (Hombale Films) ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ మూవీ హోంబలే ఫిలిమ్స్ కు మొదటి మలయాళ ప్రాజెక్ట్ కావడం విశేషం. ధూమం చిత్రానికి సెన్సార్ బోర్డు ఇటీవలే క్లీన్ యూ/ఏ సర్టిఫికెట్ జారీచేసింది. ఈ చిత్రాన్ని జూన్ 23న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
ధూమంలో కోలీవుడ్ భామ అపర్ణ బాలమురళి హీరోయిన్గా నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ధూమం ఫస్ట్ లుక్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ధూమంలో అచ్యుత్ కుమార్, వినీత్, జాయ్ మాథ్యూ, దేవ్ మోహన్, అనూ మోహన్, నందు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ధూమమ్ ట్రైలర్..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

