Malli Pelli Movie On Ott | నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన మళ్లీ పెళ్లి సినిమా రెండు నెలల క్రితం విడుదలై దారణమైన కలెక్షన్లు రాబట్టింది. సినిమాకు ఈ జంట పలు ప్రెస్మీట్లు, ఇంటర్వూలతో మంచి అటెన్షన్ గ్రాబ్ చేసిన.. అవి ప్రేక్షకులను థియేటర్ వరకు రప్పించలేకపోయాయి. నరేష్ రియల్ లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్స్ను కథగా రాసుకుని ఈ సినిమాను రూపొందించాడు. తొలిరోజే డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా వారం పూర్తయ్యే లోపే దుకాణం సర్దేసింది. కాగా థియేటర్లలో మిస్సయన వారు ఈ సినిమా ఎప్పుడు ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని తెగ ఆరాటపడుతున్నారు.
తాజాగా ఈ సినిమా ఓటీటీ డేట్‌ను లాక్ చేసుకుంది. ఈ సినిమా హక్కులను అమెజాన్ ప్రైమ్ సంస్థ దక్కించుకుంది. జూన్ 23 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ప్రకటించింది. తెలుగుతో పాటు కన్నడలోనూ ఈ సినిమా అందుబాటులో ఉందడనుంది. ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన ఈ సినిమాను నరేష్ విజయకృష్ణ ఫిలింస్ బ్యానర్‌పై స్వయంగా నిర్మించాడు.