బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో సల్మాన్ ఖాన్ (Salman Khan)కు ముంబైకి సమీపంలోని పన్వేల్ ఫామ్ హౌస్ లో పాము కాటుకు గురైన సంగతి తెలిసిందే. వెంటనే ఆస్పత్రికి తరలించారు. అయితే విషం లేని పాము కాటు వేయడంతో ప్రమాదం తప్పిందని డాక్టర్లు వెల్లడించారు. సల్మాన్‌ఖాన్‌కు ప్రాణాపాయం తప్పినట్టు అప్ డేట్ రావడంతో అభిమానులు, శ్రేయోభిలాషుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నేడు సల్మాన్‌ఖాన్ 56వ పుట్టినరోజు (Salman 56th birthday) జరుపుకుంటున్నాడు.
ఫ్యాన్స్, స్నేహితులు, ఇండస్ట్రీ ప్రముఖులు సల్మాన్‌ఖాన్ బర్త్ డే విషెస్ తెలియజేస్తున్నారు. సల్లూభాయ్ కు టాలీవుడ్లో చాలా మంది స్నేహితులున్నారు. వారిలో ఒకరు విక్టరీ వెంకటేశ్ (Venkatesh). బర్త్ డే జరుపుకుంటున్న సల్మాన్‌కు వెంకటేశ్ ట్విటర్ ద్వారా స్పెషల్ విషెస్ అందించాడు. ఓ షూటింగ్ లొకేషన్ లో సల్మాన్‌తో కలిసి దిగిన త్రో బ్యాక్ స్టిల్‌ను ట్విటర్ లో పోస్ట్ చేస్తూ..ప్రియమైన సల్మాన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఎల్లపుడూ సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని విష్ చేశాడు వెంకీ.
Happy happy birthday dear @beingsalmankhan
— Venkatesh Daggubati (@VenkyMama) December 27, 2021
Wishing you the best of everything this year! ♥️🥳 pic.twitter.com/pbPuBAMmZt
బాలీవుడ్ స్టార్ హీరోను టాలీవుడ్ స్టార్ హీరో విష్ చేస్తూ..షేర్ చేసిన స్టిల్ ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. సల్మాన్ ఖాన్ నటించిన బాడీగార్డ్(Bodyguard) చిత్రాన్ని తెలుగులో వెంకటేశ్ అదే టైటిల్‌తో రీమేక్ చేసిన విషయం తెలిసిందే.