ముంబై: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇవాళ 56వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. అయితే పాన్వెల్ ఫామ్‌హౌజ్‌లో శనివారం ప్రీ బర్త్‌డే సెలబ్రేషన్స్ సమయంలో ఓ పాము సల్మాన్‌ను కాటు వేసింది. దానికి సంబంధించిన వివరాలను సల్మాన్ వెల్లడించారు. తన ఫామ్‌హౌజ్‌లోని రూమ్‌లోకి ఓ పాము ఎంటర్ అయ్యిందని, ఆ సమయంలో పిల్లలు అరిచారని, అయితే ఓ కర్రతో ఆ పామును తొలగించే ప్రయత్నం చేశానని, ఆ సమయంలో ఆ పాము తన చేతి మీదకు వచ్చిందని, అప్పుడు దాన్ని తొలగించే ప్రయత్నం చేస్తే, అది తనను మూడు సార్లు కాటు వేసినట్లు సల్మాన్ తెలిపారు. సల్మాన్‌ను కాటు వేసిన పాము విషపూరితమా కాదా అన్న దానిపై క్లారిటీలేదు. పాము కాటుకు గురైన సల్మాన్ సుమారు ఆరు గంటల పాటు అబ్జర్వేషన్లో ఉన్నారు. యాంటీ వినోమ్ ఇంజక్షన్ తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు సల్మాన్ తెలిపారు. ఆదివారం సల్మాన్ బర్త్‌డే సెలబ్రేషన్స్‌లో మునిగితేలారు. పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన అతిథులతో సల్మాన్ ఫోటోలు దిగారు. ఆ ఫోటోలు కొన్ని లీకయ్యాయి.
పవనపుత్ర బైజాన్..
భజరంగీ బైజాన్‌కు సీక్వెల్‌గా పవనపుత్ర బైజాన్ సినిమాను తీయనున్నట్లు కండలవీరుడు సల్మాన్ తెలిపారు. డైరక్టర్ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ దానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ చేస్తున్నారని, అది పూర్తి అయిన తర్వాత తాను సినిమా తీయనున్నట్లు చెప్పారు. నో ఎంట్రీ సీక్వెల్‌గా కూడా చేస్తున్నట్లు సల్మాన్ తెలిపారు.