Salman Khan | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్‌ఖాన్ పాముకాటుకు గురయ్యారు. దీంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. సల్మాన్ ఖాన్‌పై చేయి మీద పాము కాటు వేసినట్టు తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి సల్మాన్ ఖాన్ ముంబై సమీపంలోని పన్వేల్‌లో ఉన్న తన ఫామ్‌హౌస్‌లో ఉంటున్నాడు. తెల్లవారుజామున ఆయనకు పాము కాటు వేయగానే తన సిబ్బంది ముంబైలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం సల్మాన్ ఖాన్ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అయితే.. సల్మాన్ ఖాన్‌ను కాటు వేసిన పాము.. విషపూరితమైనది కాదని డాక్టర్లు స్పష్టం చేశారు. దీంతో సల్మాన్ ఖాన్ అభిమానులు ఊపిరిపీల్చుకున్నారు.