Chiranjeevi | వయసుతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు మెగాస్టార్ చిరంజీవి. 68 ఏళ్ల వయసులో కూడా ఒకేసారి మూడు నాలుగు సినిమాలు చేస్తున్నాడు. ముఖ్యంగా 2022 నుంచి ఈయన దూకుడు మరింత పెరిగింది. గత ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో వచ్చిన చిరంజీవి.. ఈ ఏడాది ఇప్పటికే వాల్తేరు వీరయ్యతో బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల సునామీ సృష్టించాడు. ఇప్పుడు భోళా శంకర్ కూడా విడుదలకు సిద్ధమైపోయింది. ఆగస్టు 11న ఇది ప్రేక్షకుల ముందుకు వస్తుంది. మెహర్ రమేశ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే అయిపోయింది. దీని తర్వాత కళ్యాణ్ కృష్ణ, వశిష్ట లాంటి యంగ్ డైరెక్టర్స్ తో సినిమాలకు కమిటీ అయ్యాడు చిరంజీవి.
అందులో ముందుగా కళ్యాణ్ కృష్ణ సినిమా సెట్స్ పైకి రానుంది. ఆగస్టు నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి సంక్రాంతి విడుదల చేయాలనేది చిరు ప్లాన్. ఇదంతా పక్కన పెడితే తన వయసు తగ్గించుకోవడానికి మెగాస్టార్ మాస్టర్ ప్లాన్ వేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా కుర్ర హీరోలతో కలిసి నటించడానికి ఆసక్తి చూపిస్తున్నాడు చిరంజీవి. అలా నటిస్తూ తను కూడా యంగ్ అయిపోతున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ సినిమాలో సత్యదేవ్‌తో స్క్రీన్ షేర్ చేసుకున్నాడు చిరంజీవి. అందులో ఆయన విలనిజం మెగాస్టార్‌ను బాగా ఆకట్టుకుంది. అలాగే వాల్తేరు వీరయ్యలో రవితేజతో కలిసి నటించాడు చిరంజీవి. ఆయన యంగ్ హీరో కాకపోయినా కూడా.. చిరంజీవితో పోలిస్తే వయసులో చాలా చిన్నవాడు.
తాజాగా భోళా శంకర్ సినిమాలో అక్కినేని మేనల్లుడు సుశాంత్‌తో కలిసి నటిస్తున్నాడు చిరంజీవి. నెక్స్ట్ కళ్యాణ్ కృష్ణ సినిమాలో కూడా ఇద్దరు యంగ్ హీరోలున్నారు. ఇందులో సిద్దు జొన్నలగడ్డ కీలకపాత్రలో నటించబోతున్నాడు. ఆయనకు జోడీగా శ్రీ లీల నటిస్తుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతుంది. ఇక ఈ సినిమాలో విలన్‌గా కార్తికేయ ఎంపికయ్యాడని తెలుస్తోంది. గ్యాంగ్ లీడర్, వలిమై లాంటి సినిమాలలో తన విలనిజంతో అదరగొట్టాడు కార్తికేయ. దాంతో కళ్యాణ్ కృష్ణ సినిమాలో ఈయనకు అవకాశం ఇవ్వాలని చిరంజీవి రిఫర్ చేసినట్టు తెలుస్తోంది. పైగా అతని అభిమాని కూడా కావడంతో కార్తికేయకు ఓ ఛాన్స్ ఇస్తున్నాడు మెగాస్టార్. ఇలా స్క్రీన్ నిండా యంగ్ బ్లడ్ ఉండటంతో ఆయన కూడా మరింత యంగ్ అయిపోతున్నాడు.
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినిమాల రీరిలీజ్‌లు ఆపేస్తేనే బెటర్ ఏమో!
Salaar Teaser | సలార్ టీజర్లో హైలెట్ అయిన ఈ యాక్టర్ ఎవరో గుర్తున్నాడా?
Krithi Shetty | బేబమ్మ మళ్లీ పుంజుకుంటుందా.. మూడు ఇండస్ట్రీల్లో మూడు భారీ సినిమాలు..!