టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరోయిన్ సమంత (Samantha) మరో ఫీ మేల్ ఓరియెంట్‌డ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో సమంత నటిస్తున్న తాజా చిత్రం శ్రీదేవి మూవీస్ బ్యానర్ (Sridevi Movies )పై తెరకెక్కుతుంది. ప్రొడక్షన్ నెం.14గా రాబోతున్న ప్రాజెక్టుకు ‘యశోద’ (Yashoda) టైటిల్‌ను ఫైనల్ చేశారు మేకర్స్. శివలెంక కృష్ణప్రసాద్ (Sivalenka Krishna Prasad) నిర్మిస్తున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సోమవారం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది.
‘ది ఫ్యామిలీ మేన్ 2’ వెబ్ సిరీస్‌తో సమంతకు జాతీయ స్థాయిలో మంచి పాపులారిటీ వచ్చింది. సమంత నటనకు వీక్షకులు సహా విమర్శకుల ప్రశంసలు అందాయి. తెలుగు, తమిళ సినిమాల్లో పోషించిన పాత్రలకు భిన్నమైన పాత్రను ఆ వెబ్ సిరీస్‌లో చేసింది సామ్.
హీరోయిన్ ఓరియెంటెడ్ స్టోరీతో..
ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ (Sivalenka Krishna Prasad) మాట్లాడుతూ..సమంత ప్రధాన పాత్రలో నిర్మిస్తున్న హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రమిది. బాలకృష్ణతో ‘ఆదిత్య 369’ తీశాను. ఆయనతో మరో మూడు చిత్రాలు చేశాను. నానితో ‘జెంటిల్మన్’, సుధీర్‌బాబుతో ‘సమ్మోహనం’ నిర్మించాను. ఇప్పుడు సమంత ప్రధాన పాత్రలో సినిమా చేస్తుండటం సంతోషంగా ఉంది. థ్రిల్లర్ జానర్లో నేషనల్ లెవల్లో ఆడియన్స్ అందరినీ ఆకట్టుకునే కథాంశంతో తీస్తున్న చిత్రమిది. సమంత క్రేజ్, పొటెన్షియల్, ఫ్యాన్ ఫాలోయింగ్‌కు తగ్గ కథ కుదిరిందన్నారు.
ఈ రోజు పూజా కార్యక్రమాలతో సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించామని కృష్ణప్రసాద్ అన్నారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో షూటింగ్ చేయడానికి ప్లాన్ చేశాం. మార్చితో చిత్రీకరణ పూర్తవుతుంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారని వెల్లడించారు. తమిళంలో ‘మైనా’, ‘కుంకీ’, ‘గీతు’… తెలుగులో ‘చిలసౌ’, ‘రిపబ్లిక్’ తదితర సినిమాలకు పని చేసిన ఎం. సుకుమార్ ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ అందించనున్నారు. సమంతతోపాటు సినిమాలో నటించే ఇతర తారాగణం వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: ఆర్. సెంథిల్,
ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్స్: రషీద్ అహ్మద్ ఖాన్, రామాంజనేయులు,
ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్,
ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్,
మాటలు: పులగం చిన్నారాయణ,
డా. చల్లా భాగ్యలక్ష్మి,
పాటలు: రామజోగయ్య శాస్త్రి,
లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక,
కెమెరా: ఎం. సుకుమార్, సంగీతం: మణిశర్మ,
సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి,
దర్శకత్వం: హరి – హరీష్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్
ఇవి కూడా చదవండి..
Vicky katrina Wedding Updates | విక్కీకౌశల్-కత్రినా వెడ్డింగ్ అప్డేట్స్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్
Mangli Kollywood debut | రూటు మార్చిన సింగర్ మంగ్లీ..!
Mahesh family with star director | స్టార్ డైరెక్టర్ ఫ్యామిలీతో మహేశ్‌బాబు కపుల్