ఈ ఏడాది ది ఫ్యామిలీ మ్యాన్ 2తో బిగ్గెస్ట్ హిట్ ను ఖాతాలో వేసుకుంది అందాల భామ సమంత. ఈ ప్రాజెక్టులో ఎల్టీటీఈ ఏజెంట్ రాజిగా డీ గ్లామరైజ్ డ్ పాత్రలో నటించి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది. ది ఫ్యామిలీ మ్యాన్ 2లో సమంత యాక్టింగ్ కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. షూటింగ్ టైం విరామంలో షాట్ మధ్యలో హ్యాపీ మూడ్లో ఉన్న సామ్ చాలా ఎనర్జిటిక్ గా పాట పాడుతూ డ్యాన్స్ చేస్తుండగా అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీశాడు.
సామ్ ఏజెంట్ గెటప్ లో సరదాగా ఆడుతూ పాడుతూ హమ్ చేసిన వీడియోను ఇన్ స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసింది. ‘నేను ఈ పాత్ర కోసం ఎలా ప్రిపేర్ అయ్యాను అని మీరు అడుగుతున్నారు..ఇస్సా పద్ధతి లో’ అంటూ సమంత పోస్ట్ చేసిన ఈ వీడియో నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది. రాజ్-డీకే దర్శకత్వంలో వచ్చిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 మంచి టాక్ తెచ్చుకుంది.
ఇవి కూడా చదవండి..
గోవా బీచ్లో కిమ్ శర్మతో టెన్నిస్ స్టార్.. ఫోటోలు వైరల్
రామ్ మూవీ షూట్లో ప్రముఖ నటి
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!