ఈ ఏడాది ది ఫ్యామిలీ మ్యాన్ 2తో బిగ్గెస్ట్ హిట్ ను ఖాతాలో వేసుకుంది అందాల భామ సమంత. ఈ ప్రాజెక్టులో ఎల్టీటీఈ ఏజెంట్ రాజిగా డీ గ్లామరైజ్ డ్ పాత్రలో నటించి ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులు కొట్టేసింది.
ఏమాయ చేశావే సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై మెరిసి మాయ చేసింది చెన్నై అందం సమంత. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి వన్ ది లీడింగ్ స్టార్ హీరోయిన్ గా తన హవా కొనసాగిస్తోంది.