పనాజీ: సినీ నటి కిమ్ శర్మ.. టెన్నిస్ స్టార్ లియాండర్ పేస్.. గోవాలో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. ఆ ఇద్దరూ తాజాగా దిగిన ఫోటోలను ఓ గోవా రెస్టారెంట్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేసింది. కిమ్ శర్మను వెనుక నుంచి హగ్ చేసిన ఓ ఫోటోను ఆ హోటల్ తన అకౌంట్లో పోస్టు చేసింది. ఆ ఫోటో వైరల్ కావడంతో డేటింగ్ రూమర్స్ కూడా జోరందుకున్నాయి. గోవా వెకేషన్ ఎంజాయ్ చేస్తున్న ఆ జంట ఫోటోలను చూసి లియాండర్, కిమ్ అభిమానులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. పొసుద బీచ్ ఆ ఫోటోలను అప్లోడ్ చేసింది. ఇద్దరు కలిసి భోజనం చేసేముందు కూడా దిగిన ఓ ఫోటోను నిన్న ఆ రెస్టారెంట్ పోస్టు చేసింది.
ఇటీవల పలుమార్లు కిమ్ శర్మ, లియాండర్ పేస్లు ముంబైలో కనిపించారు. లియాండర్ గతంలో మోడల్ రియా పిళ్లైను పెళ్లి చేసుకున్నారు. ఇక కిమ్ శర్మ కూడా గతంలో హీరో హర్షవర్దన్ రాణేతో డేటింగ్ చేసింది.