రామ్ మూవీ షూట్లో ప్రముఖ నటి
ఎనర్జిటిక్ స్టార్ రామ్, దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం రామ్ 19వ ప్రాజెక్టు హైదరాబాద్ లో షూటింగ్ మొదలైంది.

ఎనర్జిటిక్ స్టార్ రామ్, దర్శకుడు లింగుస్వామి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ లో రెండు రోజుల క్రితం రామ్ 19వ ప్రాజెక్టు షూటింగ్ మొదలైంది. ఉప్పెన ఫేం కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన క్రేజీ అప్ డేట్ ఒకటి బయటకు వచ్చింది. మిర్చి, అత్తారింటికి దారేది చిత్రాలతో తెలుగు ఆడియెన్స్ కు బాగా కనెక్ట్ అయింది సీనియర్ నటి నదియా. ఈ నటి ఇపుడు రామ్ సినిమాలో భాగం అయింది. రామ్ చిత్రంలో కీ రోల్ పోషిస్తున్న నదియా షూట్లో జాయిన్ అయినట్టు మేకర్స్ ప్రకటించారు.
ఇస్మార్ట్ శంకర్ సక్సెస్ తర్వాత రామ్ నటిస్తోన్న పక్కా ఊర మాస్ ఎంటర్టైనర్ ఇది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తుండగా.సుజీత్ వాసుదేవన్ సినిమాటోగ్రఫీ, సాయిమాధవ్ బుర్రా సంభాషణలు రాస్తున్నారు. భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతికత విలువలతో రూపొందుతోంది. తెలుగు, తమిళ భాషల్లో నిర్మాత చిట్టూరి శ్రీనివాస్ ఈ మూవీని నిర్మిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
సెగలు రేపుతున్న శర్మ సిస్టర్స్ స్టిల్స్
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

