శనివారం 31 అక్టోబర్ 2020
Cinema - Sep 22, 2020 , 11:53:57

మ‌ళ్లీ అడ‌విలోకి వ‌చ్చేసిన ర‌కుల్‌

మ‌ళ్లీ అడ‌విలోకి వ‌చ్చేసిన ర‌కుల్‌

టాలీవుడ్ భామ ర‌కుల్ ప్రీత్ సింగ్ ప్ర‌స్తుతం క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. సాయిధ‌ర‌మ్ తేజ్ సోద‌రుడు వైష్ణ‌వ్ తేజ్ హీరోగా న‌టిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ వికారాబాద్ అడ‌వుల్లో కొన‌సాగుతుంది. ఇటీవ‌లే అనంత‌గిరి కొండ‌ల్లో జ‌రుగుతున్న షూటింగ్ భారీ వ‌ర్షం కార‌ణంగా నిలిచిపోయింది. ర‌కుల్ ప్రీత్ సింగ్ అండ్ టీం షూటింగ్ స్పాట్ నుంచి వెనుదిరిగింది. దీంతో ఢిల్లీకి వెళ్లిపోయిన ర‌కుల్ త‌న కుటుంబ‌స‌భ్యులతో విలువైన స‌మ‌యాన్ని గ‌డిపింది. అయితే తాజాగా ర‌కుల్ మ‌ళ్లీ హైద‌రాబాద్ కు వ‌చ్చేసి..వికారాబాద్ అడవుల్లోకి వెళ్లిపోయింది.

క్రిష్ అండ్ చిత్ర‌యూనిట్ వైష్ణ‌వ్ తేజ్‌, ర‌కుల్ ఇత‌ర తారాగ‌ణంపై  వ‌చ్చే  స‌న్నివేశాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఇంకా టైటిల్ ఖ‌రారు కాని ఈ చిత్రాన్ని క్రిష్ 40 రోజుల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నాడు క్రిష్‌. వైష్ణ‌వ్ తేజ్ న‌టించిన ఉప్పెన చిత్రం విడుద‌ల‌కు సిద్దంగా ఉంది.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.