శుక్రవారం 10 జూలై 2020
Cinema - Jun 02, 2020 , 11:36:39

హీరోయిన్‌ భూమిక లేటెస్ట్‌ వీడియో

హీరోయిన్‌ భూమిక లేటెస్ట్‌ వీడియో

టాలీవుడ్‌లోని అందమైన కథానాయికలలో భూమిక ఒకటి. ఈమె అందం, అభినయం, అమాయకత్వం గురించి చెప్పాలంటే ఖుషి సినిమానే నిదర్శనం. అద్భుతమైన నటనతో అందరి హృదయాలను గెలుచుకున్నది. 2000 సంవత్సరంలో యువకుడు సినిమాతో టాలీవుడ్‌లో అరంగేట్రం చేసిన భూమిక మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నది. మిస్సమ్మ చిత్రానికిగాను నంది అవార్డు అందుకున్నది భూమిక.

ఈ అందాల తార హీరోయిన్‌గానే కాకుండా అక్క, వదిన పాత్రల్లో అభిమానులకు దగ్గరవుతున్నది. పవర్‌ఫుల్‌ క్యారెక్టర్లతో మంచి పేరు తెచ్చుకుంటున్నభూమిక లాక్‌డౌన్‌లో ఇంటికే పరిమితమైంది. షూటింగులు ఆగిపోవడంతో కుటుంబ సభ్యులతో ఎంజాయ్‌ చేస్తున్నది. ఇటీవల ఒక రింగ్‌తో డ్యాన్స్‌ చేస్తున్న వీడియోను సోషల్‌ మీడియా ద్వారా అభిమనులతో షేర్‌ చేసుకున్నది. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది.
logo