పీఎస్‌యూ ఉద్యోగులకూ 61

- పదవీ విరమణ వయసు పెంచుతూ ఉత్తర్వులు
- మార్చి 30వ తేదీనుంచే వారికీ వర్తింపు
హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ): రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 58 నుంచి 61 ఏండ్లకు పెంచిన ప్రభుత్వం, తాజాగా ప్రభుత్వరంగ సంస్థల (పీఎస్‌యూ) ఉద్యోగులకు కూడా దానిని వర్తింపజేసింది. రాష్ట్రప్రభుత్వ నిధులతో నడిచే సంస్థలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ సంస్థలు, కార్పొరేషన్లు, సొసైటీలు, యూనివర్సిటీలు (నాన్-టీచింగ్ సిబ్బంది), ఇన్స్టిట్యూషన్స్లో పనిచేసే ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 61 ఏండ్లకు పెంచుతూ ఆదివారం ప్రభుత్వప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం సర్క్యులర్ జారీచేశారు. మార్చి 30వ తేదీనుంచే ఈ నిర్ణయం వర్తిస్తుందని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వులను వెంటనే అమలుచేయాలని అన్నిశాఖల అధిపతులను ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వడంతోపాటు పదవీవిరమణ వయసును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంచుతున్నట్టు బడ్జెట్ సమావేశాల సందర్భంగా సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విషయం తెలిసిందే. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్-1984ను సవరించి తెలంగాణ యాక్ట్ 3/2021ను తీసుకొచ్చి పదవీ విరమణ వయసు పెంపు నిర్ణయాన్ని అమలుచేశారు. పీఎస్‌యూల ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ వయసు పెంచాలని సీఎం ఆదేశించటంతో ఆ మేరకు సీఎస్ సర్క్యులర్ జారీచేశారు.
ఇవీ కూడా చదవండి…
టీఆర్ఎస్తోనే కులవృత్తులకు వైభవం
హల్దీవాగులోకి రెండ్రోజుల్లో జలాలు
కల్వకుర్తి కాలువలకు పాలమూరు నీళ్లు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Uttam Kumar Reddy | బ్యారేజెస్ రిహాబిలిటేషన్ చెబుతున్నట్టు నీళ్లు ఎత్తిపోయలేం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
Fire Accident | నోయిడాలో భారీ అగ్నిప్రమాదం.. ఒకరు మృతి.. పలు దుకాణాలు అగ్నికి ఆహుతి..!
Men Check Into Hotel With Girls | ఇద్దరు బాలికలతో కలిసి హోటల్లో బస చేసిన ఇద్దరు వ్యక్తులు.. తర్వాత ఏం జరిగిందంటే?
MLA Sudheer Reddy | బటన్ ఒత్తితే నీళ్లొస్తయని చెప్పినం.. హైదరాబాద్‌కు ఏడాదికి 10 టీఎంసీల నీళ్లు సరిపోతయి : ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
Kriti Sanon | మన బట్టలు, మన ఇష్టం.. కామెంట్ చేసే హక్కు వాళ్లకు ఎవరిచ్చారు?: కృతి సనన్ ఫైర్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

