e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 19, 2021
Home News వైర‌ల్ గా మారిన చిరంజీవి లేటెస్ట్ పిక్

వైర‌ల్ గా మారిన చిరంజీవి లేటెస్ట్ పిక్

మెగాస్టార్ చిరంజీవి మ‌ళ్లీ కుర్రాడు అయిపోయాడు. ఈయన మరోసారి గెట‌ప్ మార్చేసాడు. నిన్న‌టి వ‌ర‌కు కాస్త గుబురు గ‌డ్డంతో కనిపించిన చిరు.. ఇప్పుడు స్టైలిష్ లుక్ లోకి మారిపోయాడు. ఆచార్య షూటింగ్ పూర్తైపోవడంతో ఇంటికే ప‌రిమితం అయ్యాడు చిరంజీవి. దాంతో కొత్త లుక్ లో ద‌ర్శ‌న‌మిచ్చాడు మెగాస్టార్. ఇప్పుడు కొత్త లుక్ లోనూ ప‌దేళ్ల కింది చిరంజీవిని గుర్తు చేస్తున్నాడు మెగాస్టార్. అన్నయ్య లుక్ చూసి అబ్బో అనుకుంటున్నారు అభిమానులు. నిజంగా ఈయనకు 65 ఏళ్ళున్నాయా అనే అనుమానాలు వస్తున్నాయి.

అంతగా మేకోవర్ అయిపోయాడు మెగాస్టార్. చిరంజీవి మెగా లుక్ చూసి అక్క‌డున్న వాళ్లే కాదు.. అంతా ఫిదా అయిపోతున్నారు. 65 ఏళ్ల వ‌య‌సులోనూ ఓ సినిమా కోసం చిరంజీవి ప‌డుతున్న శ్ర‌మ చూసి కుర్ర హీరోలు చాలా నేర్చుకుంటున్నారు. లూసీఫర్ రీమేక్ కోసమే ఇలా మారిపోయాడు మెగాస్టార్. ఈ పాత్ర కోసం తనను తాను మార్చుకుంటున్నాడు. మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన లూసీఫర్ సినిమాను తెలుగులో కింగ్ మేకర్ పేరుతో రీమేక్ చేస్తున్నారు. దీనికి మోహన్ రాజా దర్శకుడు. త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

- Advertisement -

లూసీఫర్ తెలుగు రీమేక్ కోసం కథలో కొన్ని మార్పులు చేసారు. అయితే ఒరిజినల్ స్క్రీన్ ప్లే మాత్రం అలాగే తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ముఖ్యంగా అక్కడ మోహన్ లాల్ కు హీరోయిన్ ఉండదు.. దాంతో తెలుగులోనూ చిరుకు హీరోయిన్ లేకుండానే కథ సాగుతుందని తెలుస్తుంది. ఇందులో మరో కీలక పాత్ర కోసం సత్యదేవ్ ను ఎంచుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఏదేమైనా కూడా చిరు లేటెస్ట్ పిక్ మాత్రం అందరికీ పిచ్చెక్కిస్తుంది.

ఇవి కూడా చదవండి..

రూ.25 ల‌క్ష‌లు గెలుచుకున్న రాంచ‌రణ్

‘రామారావు’తో వేణు గ్రాండ్ క‌మ్‌బ్యాక్

అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా బిగ్ బాస్ బ్యూటీ

రాజ్ కుంద్రా బెయిల్ తిర‌స్క‌ర‌ణ‌..గెహ‌నా వ‌శిష్ఠ్ పై కేసు

షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్‌..!

త‌రుణ్‌, ఉద‌య్‌కిర‌ణ్‌తో న‌న్ను పోల్చొద్దు: వ‌రుణ్ సందేశ్‌

ప్రియ‌మణి-ముస్త‌ఫారాజ్ వివాహం చెల్ల‌దు..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana