Gukesh | వార్సా: ఇటీవలే క్యాండిడేట్స్ చెస్ టోర్నీ విజేతగా నిలిచిన భారత యువ గ్రాండ్‌మాస్టర్ దొమ్మరాజు గుకేశ్.. వార్సా (పోలండ్) వేదికగా జరుగుతున్న సూపర్‌బెట్ ర్యాపిడ్, బ్లిట్జ్ టోర్నీలో భాగంగా ర్యాపిడ్ రౌండ్స్‌లో తడబడ్డాడు. శుక్రవారం 8వ రౌండ్లో వీ యి (చైనా)తో గేమ్‌లో ఓడిన గుకేశ్.. 9వ రౌండ్లో జాన్ క్రిస్టోఫ్ (పోలండ్) చేతిలో పరాభవం పాలయ్యాడు. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి.. 8వ రౌండ్లో ప్రజ్ఞానందతో గేమ్‌ను డ్రా చేసుకుని 9వ రౌండ్లో విన్సెంట్ కేమర్ (జర్మనీ) చేతిలో ఓడాడు.