Nisha Dahiya | ఇస్తాంబుల్: వరల్డ్ ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత రెజ్లర్ నిషా దహియా పారిస్ ఒలింపిక్స్లో ఐదో బెర్తును దాదాపుగా ఖాయం చేసుకుంది. ఇస్తాంబుల్ వేదికగా శుక్రవారం ముగిసిన మహిళల 68 కేజీల విభాగంలో నిషా.. 3-0తో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ అడెలా హజ్లికోవ (చెక్ రిపబ్లిక్)ను ఓడించి సెమీస్కు అర్హత సాధించింది. సెమీస్లో ఆమె అలెగ్జాండ్రియా (రొమేనియా)తో తలపడనుంది. ఈ పోరులో గెలిచి ఫైనల్కు చేరితే నిషాకు ఒలింపిక్స్ బెర్తు నేరుగా ఖాయమైనట్టే.