టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ ( Ram charan ) రెమ్యునరేషన్ విషయం గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఒక్క సినిమాకు కోట్ల రూపాయల్లో పారితోషికం అందుకుంటాడు. అయితే ఈ యంగ్ హీరో రూ.25 లక్షలు గెలుచుకున్నాడన్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. ఇంతకీ రాంచరణ్ ఏంటి ఇలా నగదు గెలుచుకోవడమేంటీ అనుకుంటున్నారా…? ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తోన్న ఎవరు మీలో కోటీశ్వరుడు షో ఫస్ట్ ఎపిసోడ్ లో మెరిశాడు రాంచరణ్.
ఈ షోతో ఆర్ఆర్ఆర్ స్టార్ హీరోలు ఒక్కచోట సందడి చేశారు. కేబీసీ (కౌన్ బనేగా కరోర్ పతి) స్పూర్తితో వస్తోన్న ఈ షోలో కంటెస్టంట్ ప్రతీ కరెక్ట్ సమాధానానికి రెట్టింపు నగదు గెలుచుకుంటారు. అయితే రాంచరణ్ రూ.25 లక్షల నగదు గెలుచుకున్నాడు. ఆ తర్వాత రెండు ప్రశ్నలకు సమాధానం చెబితే రాంచరణ్ కోటీశ్వరుడు అయ్యేవాడు. తొలి ఎపిసోడ్ ను ఆర్ఆర్ఆర్ స్పెషల్ గా షూట్ చేశారు.
ఇప్పటికే మేకర్స్ ఈ షోకు సంబంధించి 16 ఎపిసోడ్స్ షూట్ చేశారు. మిగిలిన భాగాన్ని ఎన్టీఆర్ ఉక్రెయిన్ షూటింగ్ నుంచి తిరిగొచ్చిన తర్వాత షూట్ చేయనున్నారు. రెగ్యులర్ కంటెస్టంట్లు తర్వాతి ఎపిసోడ్స్ లో కనిపించనున్నారు.
ఇవి కూడా చదవండి..
అసిస్టెంట్ డైరెక్టర్ గా బిగ్ బాస్ బ్యూటీ
రాజ్ కుంద్రా బెయిల్ తిరస్కరణ..గెహనా వశిష్ఠ్ పై కేసు
షూటింగ్స్ తో ఢిల్లీ భామ బిజీ షెడ్యూల్..!
‘మోస్ట్ హ్యాండ్సమ్ ఏసియన్ మ్యాన్ ’ గా ప్రభాస్
తరుణ్, ఉదయ్కిరణ్తో నన్ను పోల్చొద్దు: వరుణ్ సందేశ్
ప్రియమణి-ముస్తఫారాజ్ వివాహం చెల్లదు..