Anupama Parameswaran| అనుపమ పరమేశ్వరన్ ను హ్యాపీగా ఉంచేది ఏంటంటే..!
ప్రేమమ్ సినిమాతో కుర్రకారు మనసు దోచేసింది కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ఈ మలయాళ సుందరిని హ్యాపీ గా ఉంచే విషయం ఏంటో తెలుసా..?

ప్రేమమ్ సినిమాతో కుర్రకారు మనసు దోచేసింది కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ఈ మలయాళ అందం సినిమాలతోనే కాదు సోషల్ మీడియా పోస్టులతో నెటిజన్లు, ఫాలోవర్లతో ఎప్పుడూ టచ్ లో ఉంటుంది. అయితే ప్రతీ ఒక్కరి విషయంలో వారికి సంతోషాన్నిచ్చేది ఏదో ఒకటుంటుంది. మరి అనుపమ పరమేశ్వరన్ ను సంతోషంగా ఉంచే విషయమేంటో తెలుసా..? ఈ భామకు పూరీ అంటే చాలా ఇష్టమట. పూరీ అంటే ఉదయాన్నే టిఫిన్ లో తినే పూరీ కాదండోయ్..ఛాట్ బండార్ లో దొరికే పానీ పూరీ (PaniPuri). ఇదే విషయాన్ని తన ఫాలోవర్లకు చెబుతూ ఇన్ స్టాగ్రామ్ ఓ ఫొటోను షేర్ చేసింది.
పూరీలతో ఉన్న ఓ ప్లాస్టిక్ గిన్నెను చేతిలో పట్టుకుని హ్యాపీగా నవ్వుతూ కెమెరాకు ఫోజులిచ్చింది. ‘సంతోషమంటే….’ అంటూ క్యాప్షన్ ఇచ్చింది. వైట్ షర్ట్, డెనిమ్ షార్ట్ లో కనిపిస్తుండగా..షార్ట్ పై ‘ఈ సమయంలో’, ‘మిమ్మల్ని మీరు ప్రేమించండి..’ అంటూ ప్రింట్ చేయించుకుంది అనుపమ. అభిమానులు, ఫాలోవర్లకు తమకిష్టమైన వస్తువులను గుర్తు చేస్తూ అనుపమ పరమేశ్వరన్ పోస్ట్ చేసిన తాజా స్టిల్ నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది.
తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. తెలుగులో రౌడీ బాయ్స్, కార్తికేయ 2, 18 పేజెస్ చిత్రాలు అనుపమ ఖాతాలో ఉన్నాయి. ప్రస్తుతం నిఖిల్ తో కలిసి 18 పేజెస్ షూటింగ్ తో బిజీగా ఉంది అనుపమ. ఈ మూవీకి సుకుమార్ కథనందించగా..పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వం వహిస్తున్నాడు. గీతాఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నాయి.

ఇవి కూడా చదవండి..
Vijayendraprasad on RGV| ఆ ఆర్జీవీ ‘కనబడుటలేదు’.. విజయేంద్రప్రసాద్ కామెంట్స్ వైరల్
శృతి హాసMahesh Babu| స్టార్ డైరెక్టర్ కొడుకు మహేశ్ బాబుకు వీరాభిమాని అట..!
Chiranjeevi | చిరంజీవి గొప్ప మనసుపై అసిస్టెంట్ డైరెక్టర్ ఏమన్నారంటే…?
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Foreign currency | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా ఫారిన్ కరెన్సీ పట్టివేత
Karimnagar | ధ్రువీకరణ పత్రం అందేదెలా?.. కరీంనగర్ నగరపాలక సంస్థ నిర్లక్ష్యంతో విలీన గ్రామాల వారికి తిప్పలు
Samantha | సమంతదే నంబర్ వన్.. టాప్ 4లోకి దూసుకొచ్చిన రష్మిక మందన్నా..!
Road accident | బీదర్లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు సంగారెడ్డి వాసులు దుర్మరణం
Ganja Delivery Racket | డెలివరీ ముసుగులో గంజాయి దందా.. ఇద్దరిని అరెస్టు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

