Vijay Deverakonda | విజయ్ దేవర కొండ (Vijay Deverakonda) చివరగా కల్కి 2898 ఏడీ చిత్రంలో గెస్ట్ రోల్లో మెరిసిన విషయం తెలిసిందే. కాగా ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైన్లో పెట్టాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో విజయ్ దేవరకొండ నటిస్తోన్న సినిమా VD14. టాక్సీవాలా ఫేం రాహుల్ సంకీర్త్యన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇతిహాసాలు రాయలేదు.. అవి హీరోల రక్తంలో ఇమిడిపోయాయి.. అంటూ సినిమా ఇంట్రో ఎలా ఉండబోతుందో తెలియజేస్తూ రిలీజ్ చేసిన ప్రీ లుక్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది.
ఈ చిత్రంలో ది మమ్మీ, ది మమ్మీ రిటర్న్స్ లాంటి ఐకానిక్ రోల్స్‌తో సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న సౌతాఫ్రికన్ నటుడు అర్నాల్డ్ వొస్లో కీలక పాత్రలో కనిపించబోతున్నాడన్న వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. మేకర్స్ అర్నాల్డ్ వొస్లోను ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తుండగా.. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే విజయ్ దేవరకొండ సినిమాకు సూపర్ హైప్ తెస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
ఇప్పటికే లైగర్‌లో మైక్ టైసన్‌ను తీసుకున్నప్పటికీ భారీ డిజాస్టర్‌గా నిలిచింది. అయినప్పటికీ వీడీ 14లో ఇంటర్నేషనల్ స్టార్ అర్నాల్డ్ వొస్లో జాయిన్ అయ్యాడన్న వార్త నెట్టింట వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ మరోవైపు గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో కాప్ డ్రామా వీడీ 12 (VD12) చేస్తుండగా.. షూటింగ్ దశలో ఉంది.
Nikhil Siddhartha | ప్రతీ పది నిమిషాలకో ట్విస్ట్.. అప్పుడో ఇప్పుడో ఎప్పుడో సినిమాపై నిఖిల్
Thandel | డైలామాకు చెక్.. ఆ టైంలోనే నాగచైతన్య తండేల్ రిలీజ్..!