హైదరాబాద్ : నగరంలోని పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై రెండు ర్యాంపులు అందుబాటులోకి వచ్చాయి. సీఎస్ సోమేశ్‌కుమార్‌తో కలిసి పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ఉప్పర్‌పల్లిలో పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ ర్యాంప్‌లను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఎమ్మెల్సీలు మహేందర్‌రెడ్డి, యెగ్గె మల్లేశం, మేయర్ విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. రూ. 22 కోట్లతో అత్తాపూర్ పిల్లర్ నెంబర్ 164 దగ్గర ర్యాంపుల నిర్మాణం జరిగింది.
ఈ ర్యాంపుల అందుబాటుతో రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హైటెక్ సిటీ వైపు వెళ్లే ప్రయాణికులు ఉప్పర్‌పల్లి వద్ద దిగి టోలీచౌకి, ఐటీ కారిడార్, ఇతర ప్రాంతాలకు చేరుకోవచ్చు. అదేవిధంగా ఉప్పర్‌పల్లి వద్ద రెండవ ర్యాంప్‌ను ఉపయోగించి పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా ఆర్జీఐఏకు చేరుకోవచ్చు. ఈ ర్యాంపుల అందుబాటుతో రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి, బుద్వేల్ వంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ తగ్గనుంది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ అరవింద్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
MA&UD Minister @KTRTRS inaugurated the newly constructed ramps of PVNR Expressway at Upparpally today. pic.twitter.com/TeaI0pnJ2L
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) May 29, 2021