Ustaad Bhagat Singh | పవన్ కల్యాణ్ (Pawan Kalyan) టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ (UstaadBhagatSingh). హరీష్ శంకర్ (Harish shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో శ్రీలీల ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. రాశీఖన్నా కీ రోల్ పోషిస్తోంది. లీడింగ్ ప్రొడక్షన్ హౌజ్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ దేఖ్ లేంగే సాలా నెట్టింటిని షేక్ చేస్తోంది.
తాజాగా మేకర్స్ మొట్టమొదటి సారి లక్ష మంది ఫ్యాన్స్ ఎంట్రీస్‌తో దేఖ్లేంగే సాలా సాంగ్ లిరిక్ షీట్‌ను లాంచ్ చేశారు. దేవీ శ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన ఈ పాటను భాస్కర బట్ల రాయగా.. విశాల్ దడ్లానీ పాడాడు.
రంపంపం రంపంపం స్టెప్పేస్తే భూకంపం అంటూ లాంగ్ గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్‌లోని స్టైలిష్ డ్యాన్స్‌ను మరోసారి సిల్వర్ స్క్రీన్‌పై చూపించబోతున్నట్టు విజువల్స్ చెప్పేస్తున్నాయి.
భగత్.. భగత్ సింగ్ మహంకాళి పోలీస్‌స్టేషన్, పత్తర్ గంజ్, ఓల్డ్ సిటీ. ఈ సారి పర్ ఫార్మన్స్ బద్దలైపోద్ది.. అంటూ ఉస్తాద్ భగత్ సింగ్ గ్లింప్స్‌లో తనదైన మ్యానరిజంతో సాగుతున్న పవన్ కల్యాణ్ డైలాగ్స్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ చిత్రాన్ని మార్చి 26న 2026కు విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
దేఖ్లేంగే సాలా సాంగ్..
#UstaadBhagatSingh first single #DekhlengeSaala out now ❤🔥
This song Will be celebrated for a long time 💥💥💥💥
Cult Captain @harish2you‘s Feast 💥
A Rockstar @ThisisDsp Musical ❤️🔥
Sung by @vishaldadlani, @HariPriyaSinger
Lyrics @bhaskarabhatla… pic.twitter.com/c46kgbYpGQ— Ustaad Bhagat Singh (@UBSTheFilm) December 13, 2025
Actor Pragathi | నా పూజల వలనే మెడల్స్ గెలిచింది.. నటి ప్రగతి పతకాలపై వేణు స్వామి కామెంట్స్
Akhanda 2 | బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోన్న ‘అఖండ 2’.. బాలయ్య మాస్ తుపానుకి తొలి రోజు ఫుల్ కలెక్షన్స్
Lionel Messi | ఒకచోట ఇద్దరు దిగ్గజాలు.. మెస్సీని కలిసిన షారుఖ్ ఖాన్.. వీడియో