IPL 2026 : బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం మళ్లీ ఐపీఎల్ (IPL) మ్యాచ్‌లతో కళకళలాడనుంది. తొక్కిసలాట (Stampede) తర్వాత వెలవెలబోతున్న ఈ మైదానంలో మ్యాచ్‌ల నిర్వహణకు కర్నాటక ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఇటీవలే రాష్ట్రం నుంచి ఐపీఎల్ మ్యాచ్‌లను తరలిపోనివ్వమని చెప్పిన డిప్యూటీ సీఎం శివకుమార్ (DK Shiva Kumar) తమ సర్కార్ తరఫున చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేశారు. అంతేకాదు బెంగళూరు ఇమేజ్ను కాపాడేందుకు అవసరమైన జాగ్రత్తలు, షరతులు తప్పనిసరని ఆయన వెల్లడించారు.
జూన్ 4న తొక్కిసలాట తర్వాత చిన్నస్వామి స్టేడియంలో భద్రతా లోపాలు ఉన్నాయని ఏకసభ్య కమిషన్ తీర్పునిచ్చింది. అందుకని పోలీసులు కర్నాటక క్రికెట్ సంఘానికి ఎన్ఓసీ ఇవ్వడం లేదు. దాంతో.. స్వతంత్ర సభ్యుడి నుంచి ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం కర్నాటక ప్రభుత్వం పావులు కదిపింది. కేఎస్‌సీఏకు అన్ని విధాలా సహకరించిన కర్నాటక సర్కార్ చిన్నస్వామికి పూర్వవైభవం తీసుకురానుంది.
The decks have been cleared for the M Chinnaswamy Stadium to host matches 🔙
Full story: https://t.co/5nkv2PNK33 pic.twitter.com/vI0kb3rZBC
— ESPNcricinfo (@ESPNcricinfo) December 13, 2025
‘ఐపీఎల్ మ్యాచ్‌ల గురించి నిర్ణయానికి వచ్చాం. ఈసారి బెంగళూరు ఆతిథ్యమిస్తుందని నమ్మకంతో ఉన్నాం. కర్నాటక క్రికెట్ సంఘం అధికారులతో సమావేశం భద్రతా, ఇతర ఏర్పాట్లకు సంబంధించిన చర్యలపై చర్చించాలని హోం మంత్రి జి.పరమేశ్వరను కోరాం. చిన్నస్వామిలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరిపి తీరుతాం. తొక్కిసలాట జరిగిందనే సాకుతో బెంగళూరు ప్రతిష్టను దెబ్బతీయాలనుకోవడం సమంజసం కాదు’ అని శివకుమార్ పేర్కొన్నారు.
ఆర్సీబీ విక్టరీ పరేడ్‌లో జరిగిన తొక్కిసలాట (Stampede) ఘటనతో చిన్నస్వామి స్టేడియం మ్యాచ్‌లకు దూరమైంది. పదకొండు మంది మృతికి కారణమైనందున కోర్టు కేసు.. పోలీసులు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) ఇవ్వకపోవడంతో.. ఆరు నెలలుగా ఇక్కడ ఒక్క మ్యాచ్ జరగడం లేదు. ఐపీఎల్ మ్యాచ్‌లను కూడా చిన్నస్వామి నుంచి తరలిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. చిన్నస్వామి స్టేడియం బెంగళూరుకు గర్వకారణమని చెప్పిన ఆయన.. ఎలాగైనా రాష్ట్రంలో ఐపీఎల్ మ్యాచ్‌లు నిర్వహిస్తామని అన్నారు.
DK Shivakumar on IPL Match | 2026ರ IPL ಪಂದ್ಯಗಳು ಬೆಂಗಳೂರಲ್ಲಿ ನಡೆಯೋದು ಫಿಕ್ಸ್ | RCB match
.
.
.
.
.
.
.#dkshivakumar #rcbmatch #chinnaswamystampede #KSCAElection2025 #chinnaswamystadium pic.twitter.com/bfY7rrUeNz— Sanjevani News (@sanjevaniNews) December 7, 2025
‘భవిష్యత్‌లో తొక్కిసలాట వంటి దుర్ఘటనలు జరగకుండా జాగ్రత్తపడుతాం. రాబోయే రోజుల్లో కర్నాటక క్రికెట్ స్టేడియం ఆధ్వర్యంలోని చిన్నస్వామిలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తాం. చిన్నస్వామి మన బెంగళూరుకు గర్వకారణం. స్టేడియంలో మ్యాచ్‌లు ఆడించేటప్పుడు భారీగా అభిమానులను అనుమతించకుండా చర్యలు తీసుకుంటాం. అంతేకాదు చిన్నస్వామికి ప్రత్యామ్నాయంగా ఒక పెద్ద స్టేడియం నిర్మిస్తాం. నిరుడు తొక్కిసలాట తర్వాత నెలకొన్న పరిస్థితులతో ఐపీఎల్ మ్యాచ్‌లను బెంగళూరు నుంచి తలరిస్తారనే వార్తలు వస్తున్నాయి. అయితే.. ఇప్పటికిప్పుడు అలాంటి నిర్ణయం తీసుకోరని అనుకుంటున్నా. చిన్నస్వామిలోనే ఐపీఎల్ ఆడిస్తాం. అందుకు అవసరమైన న్యాయపరమైన చర్యలు తీసుకుంటాం’ అని శివకుమార్ తెలిపారు. డిసెంబర్ 16న అబూధాబీలో ఐపీఎల్ మినీ వేలం జరుగనుంది. అనంతరం కొన్ని రోజుల్లోనే టోర్నీ షెడ్యూల్‌ను ప్రకటించే అవకాశముంది.