Ranbir Kapoor | బాలీవుడ్లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న స్టార్ కపుల్స్‌లో టాప్‌లో ఉంటారు అలియాభట్-రణ్ బీర్ కపూర్ (Ranbir Kapoor). ఈ ఇద్దరు సోషల్ మీడియాలో చురుకుగా ఉంటారని తెలిసిందే. అయితే రణ్ బీర్ కపూర్ అలియాభట్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు.
గోవాలో జరుగుతున్న 55వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో రణ్ బీర్ కపూర్ మాట్లాడుతూ.. తాను మొదటిసారి అలియాభట్ (Alia Bhatt)ను కలిసినప్పుడు కిశోర్‌కుమార్ (Kishore Kumar) ఎవరని తనను అడిగిందన్నాడు. ఎవరూ ఊహించని ఈ కామెంట్‌తో అలియాభట్‌కు కిశోర్ కుమార్ ఎవరో తెలియదా.. అంటూ షాకవుతున్నారు కొందరు జనాలు. ఇక అలియా భట్‌పై (స్వీటెస్ట్ రివెంజ్) ప్రతీకారం తీర్చుకునేందుకు రణ్ బీర్‌కు ఇదే సరైన మార్గం అంటూ గతంలో అలియాభట్ చేసిన కామెంట్స్‌కు ప్రతిగా కొందరు నెట్టింట తమదైన శైలిలో ఫన్నీగా చురకలంటిస్తున్నారు.
తన పెదవులపై లిప్‌స్టిక్ వేసుకోవడం రణ్ బీర్‌కు ఇష్టం లేదని గతంలో చెప్పింది అలియా భట్. ఈ కామెంట్‌పై అప్పట్లో రణ్ బీర్‌పై ట్రోల్స్ వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు రణ్ బీర్‌కు తన భార్యపై పగ తీర్చుకునే అవకాశం వచ్చిందంటున్నారు నెటిజన్లు.
Devi Sri Prasad | ఎవరూ క్రెడిట్ ఇవ్వరు.. హాట్ టాపిక్‌గా పుష్ప నిర్మాతలపై డీఎస్పీ కామెంట్స్
Rashmika Mandanna | అతడెవరో అందరికీ తెలుసు.. రిలేషన్‌షిప్‌పై ఓపెన్ అయిపోయిన రష్మికమందన్నా
Jr NTR | హిందీలో రెండో సినిమా.. ఆ అగ్రిమెంట్‌పై తారక్ సైన్ చేశాడా ఏంటీ..?
Vijay Antony | విలన్‌గా విజయ్ ఆంటోనీ మేనల్లుడి గ్రాండ్ ఎంట్రీ.. గగన మార్గన్ పోస్టర్లు వైరల్