Thammareddy Baradwaja | కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇదే జోనర్లో వస్తోంది జాతర (Jathara). రాటకొండ స్వీయ దర్శకత్వంలో లీడ్ రోల్లో నటిస్తున్నాడు. దేవుడు ఆడే జగన్నాటకం.. ఆ దేవునితో మనిషి ఆడించే పితలాటకం అంటూ ఫస్ట్ లుక్‌తోనే సినిమాపై క్యూరియాసిటీ పెంచేస్తుంది టీం. ఈ చిత్రం నవంబర్ 8న ప్రేక్షకుల ముందు రానుంది.
ఈ నేపథ్యంలో రీసెంట్గా ఏర్పాటు చేసిన ప్రమోషనల్ ఈవెంట్లో దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. మేం మా ఊరిలో గుడి కట్టించాం. అక్కడ ఉన్న దేవత విగ్రహాన్ని కదల్చాలనుకున్నాం. కానీ అందరూ వద్దని వారించారు. జాతర సినిమా కాన్సెప్ట్ కూడా ఇదేనన్నారు తమ్మారెడ్డి భరద్వాజ. శివబాలాజీ మాట్లాడుతూ.. జాతర ట్రైలర్ చూశా. చాలా ఆసక్తికరంగా అనిపించిందన్నాడు. హీరో కమ్ డైరెక్టర్ సతీశ్ బాబుకు ఆల్ ది బెస్ట్. జాతర చాలా పెద్ద హిట్ అయి నిర్మాతలకు లాభాలు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నట్టు చెప్పాడు.
చిత్తూరు బ్యాక్ డ్రాప్లో సాగే జాతర నేపథ్యంలో తెరకెక్కుతున్నగల్లా మంజునాథ్ సమర్పిస్తున్న ఈ మూవీని రాధాకృష్ణ ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై ఎల్ఎల్సీతో కలిసి రాధాకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో దియారాజ్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తుండగా.. గోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా, సాయి విక్రాంత్, ఆర్కే పిన్నపాల ఇతర పాత్రల్లో నటిస్తుండగా.. శ్రీజిత్ ఎడవణ సంగీతం అందిస్తున్నారు.
The countdown begins
Buckle up for mass #Jathara in theatres near you
The action-packed #Jathara set for release on November 8th@yourSathishbabu #DeeyaRaj #GallaManjunath #RadhakrishnaReddy #SivaShankarReddy #RadhakrishnaaProductionCompany #MovieteckLLC #KVPrasad… pic.twitter.com/oWv2rX84EQ
— BA Raju’s Team (@baraju_SuperHit) November 6, 2024
Kanguva | ఇక హైదరాబాద్‌లో.. సూర్య కంగువ ప్రీ రిలీజ్ ఈవెంట్ టైం, వెన్యూ ఫిక్స్..!
Revolver Rita | రివాల్వర్ రీటా వచ్చేస్తుంది.. టాప్ బ్యానర్ల చేతిలో కీర్తి సురేశ్ సినిమా రైట్స్
Sai Pallavi | సాయి పల్లవి యాక్టింగ్ చూసి ఏడ్చేశా.. అల్లు అరవింద్ కామెంట్స్ వైరల్