Revolver Rita | నేషనల్ అవార్డ్ విన్నింగ్ నటి కీర్తి సురేశ్ (Keerthy Suresh) వరుస సినిమాలతో బిజీగా ఉందని తెలిసిందే. ఈ భామ టైటిల్ రోల్లో నటిస్తోన్న చిత్రం రివాల్వర్ రీటా (Revolver Rita). చంద్రు (Kaddipudi Chandru) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. రివాల్వర్ రీటా పంపిణీ హక్కులకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ సినిమా తెలుగు పంపిణీ హక్కులను హాస్య మూవీస్ నిర్మాత రాజేశ్ దండా దక్కించుకోగా.. కర్ణాటక హక్కులను బెంగళూరు కుమార్ ఫిలిమ్స్ దక్కించుకుంది. కీర్తిసురేశ్ సినిమాకు క్రేజీ ఎలా ఉందో తాజా వార్త చెప్పకనే చెబుతోంది. ఈ మూవీలో రాధికాశరత్ కుమార్, అజయ్ ఘోష్, సునీల్, జాన్ విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ఇటీవల లాంఛ్ చేసిన విడుదల చేసిన రివాల్వర్ రీటా టీజర్ కీర్తి సురేశ్ మార్క్ హ్యూమర్ టచ్‌తో యాక్షన్ పార్టుతో స్టన్నింగ్‌గా సాగుతోంది. కీర్తి సురేశ్ మార్కెట్లో కూరగాయలు కొంటుండగా.. పాత అంబాసిడర్ కారులో ఉన్న దొంగలునుంచి ఆమెను చూస్తారు. కారులో కీర్తిసురేశ్ దగ్గరకు వచ్చి హ్యాండ్ బ్యాగ్‌ను లాక్కెళ్తారు.
ఆ తర్వాత వారిని వెంబడించిన కీర్తిసురేశ్ రివాల్వర్ రీటాగా మారుతుంది. ఇంతకీ రివాల్వర్ రీటా ఏదైనా మిషన్‌లో పాల్గొంటుందా.. ? అనేది సస్పెన్స్ లో పెడుతూ సాగే సన్నివేశాలు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి.
LOCK, LOAD & DEAL 🔫
The much awaited @KeerthyOfficial‘s #RevolverRita,
AP, Telangana and Karnataka rights bagged by @HasyaMovies & @films_kumar ❤️🔥Get ready for the action 💥@Jagadishbliss @Sudhans2017 @realradikaa @dirchandru @PassionStudios_ pic.twitter.com/lruQgcb301
— Bangalore Kumar films (@films_kumar) November 5, 2024
Thandel | నాగచైతన్య, సాయి పల్లవి ఎమోషనల్ స్టిల్.. థియేటర్లలో తండేల్ సునామి వచ్చే తేదీ ఇదే..!
Devara | దేవర వచ్చేస్తున్నాడు.. ఓటీటీ ప్లాట్‌ఫాంలో తారక్ మూవీ స్ట్రీమింగ్ టైం ఫిక్స్
Thalapathy 69 | బాక్సాఫీస్‌ను రూల్ చేయబోతున్న విజయ్-హెచ్ వినోథ్.. దళపతి 69 రైట్స్‌కు రికార్డ్ ధర