స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar), స్టార్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ బాస్టర్ చిత్రం భారతీయుడు. దీనికి సీక్వెల్‌గా ఇండియన్ 2 (Indian 2) రాబోతున్న విషయం తెలిసిందే. నిర్మాతలు, డైరెక్టర్ మధ్య నెలకొన్న విభేదాలు కోర్టు వరకు వెళ్లడంతో ఈ ప్రాజెక్టు అటకెక్కింది. అయితే ఇండియన్ 2 విషయంలో ఏర్పడిన డైలామాకు తెరపడింది. మేకర్స్, డైరెక్టర్ మధ్య విభేదాలు కొలిక్కి రావడంతో మళ్లీ ఇండియన్ 2 చిత్రీకరణతో ట్రాక్ పైకి రాబోతుందని కోలీవుడ్ సర్కిల్ టాక్. కాగా ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్ కోసం ముందుగా మేకర్స్ కాజల్ అగర్వాల్‌ను అనుకున్న సంగతి తెలిసిందే.
అయితే ప్రెగ్నెన్సీ కారణంగా కాజల్ అగర్వాల్ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో..ఆమె స్థానంలో మరో భామను ఫైనల్ చేశారట. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ జోష్ మీదున్న మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia)ను ఫీ మేల్ లీడ్ రోల్ కోసం ఎంపిక చేసినట్టు కోలీవుడ్ సర్కిల్ టాక్. ప్రస్తుతం శంకర్ టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ 15వ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మెహర్ రమేశ్ దర్శకత్వం వహిస్తున్న భోళా శంకర్ సినిమాలో ఫీ మేల్ లీడ్ రోల్ చేస్తోంది తమన్నా.
శంకర్ ప్రాజెక్టు ఒకే అయితే పాన్ ఇండియా ప్రాజెక్టులో నటించే క్రేజీ ఆఫర్ తమన్నా ఖాతాలో పడిపోయినట్టే. తమన్నా ఈ క్రేజీ సినిమాలో కన్ఫామ్ అయిందా..? అనే అప్ డేట్ పై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇటీవలే సీటీమార్, మ్యాస్ట్రో చిత్రాలతో ఆడియెన్స్ ముందుకొచ్చింది తమన్నా. ఈ రెండు చిత్రాలు బాక్సాపీస్ వద్ద మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్నాయి.
ఇవి కూడా చదవండి..
Bheemla Nayak Legendary actor | భీమ్లా నాయక్‌లో లెజెండరీ నటుడు..ఎవరో తెలుసా..?
Upasana lehenga outfit | ఉపాసన 9 ఏండ్ల తర్వాత మళ్లీ ఇలా..ట్రెండింగ్ అవతార్
Daniel sekhar meets Kurien | ‘కురియన్’ను కలిసిన ‘డానియల్ శేఖర్’..ఇంతకీ ఇక్కడో తెలుసా..?
Naa Kosam Lyrical Video | సిద్ శ్రీరామ్ మరో మ్యాజిక్..బంగార్రాజు నుంచి ‘నా కోసం’ వీడియో సాంగ్