Goddess Tamannaah | దేవతలా మారిపోయిన తమన్నా..అరటాకులో భోజనం
టాలీవుడ్ (Tollywood) మిల్కీ బ్యూటీ (Tamannaah) తనలోని మరో యాంగిల్‌ను అందరికీ చూపించబోతుంది. ఎప్పుడూ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో మెరిసే తమన్నా ఇపుడు నల్ల చీర, బ్లౌజ్లో నెత్తిన కిరీటం పెట్టుకుని, మెడలో ఆభరణాలు వేసుకుని అరటాకులో భోజనం (Banana Leaf Meal) చేస్తుంది.

టాలీవుడ్ (Tollywood) మిల్కీ బ్యూటీ (Tamannaah) గ్లామరస్ రోల్స్ తోపాటు సస్పెన్స్ థ్రిల్లర్ జోన్లో సినిమాలు చేసి అలరించింది. ఈ భామ తనలోని మరో యాంగిల్‌ను అందరికీ చూపించబోతుంది. ఇంతకీ అదెంటనే కదా మీ డౌటు. ఈ సారి దేవత (Goddess Tamannaah)గా కనిపించబోతుంది తమన్నా. అవును మీరు చదివింది నిజమే. ఎప్పుడూ ట్రెండీ కాస్ట్యూమ్స్ లో మెరిసే తమన్నా ఇపుడు నల్ల చీర, బ్లౌజ్లో నెత్తిన కిరీటం పెట్టుకుని, మెడలో ఆభరణాలు వేసుకుని అరటాకులో భోజనం (Banana Leaf Meal) చేస్తుంది.
ఈ ముంబై భామ సోఫాలో కూర్చొని అరటాకులో ఇడ్లీ, వడ, దోస ఆరగిస్తున్న స్టిల్ ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. ఇదంతా సరే మరి తమన్నా ఇలా కనిపించడానికి కారణం ఏ జ్యువెల్లరీ యాడో, టీవీ షోనో అనుకుంటున్నారా..? కాదు. తాజా అప్డేట్ ప్రకారం ఎఫ్ 3 సినిమా (F3 movie)కోసం ఇలా మారిపోయింది తమన్నా. తన భర్త వెంకటేశ్ చేజింగ్ చేసే పరాశక్తిగా కనిపించనుందట తమన్నా.
సినిమాలో వచ్చే చిన్న కామెడీ సన్నివేశం కోసం మరో హీరోయిన్ మెహరీన్ కూడా ఇలాంటి గెటప్‌లోనే కనిపించనుందని టాలీవుడ్ సర్కిల్ టాక్.తమన్నా పోస్ట్ చేసిన తాజా స్టిల్‌పై ఫ్యాషన్ డిజైనర్ నిషికా లుల్లా, హీరోయిన్లు సమంత, ఈషా గుప్తా కామెంట్ల వర్షం కురిపించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండిఇది కూడా చూడండి
ఇది కూడా చూడండి
Katrina Vicky Kaushal wedding | జైపూర్ వెడ్డింగ్ కంటే ముందు మరో వెడ్డింగ్..!
Big Shock to Pragya Jaiswal | ప్రగ్యాజైశ్వాల్కు బిగ్ షాక్..ఇక అఖండపైనే ఆశలు..!
Jersey Hindi trailer | నాని రోల్లో జీవించేసిన షాహిద్ కపూర్..జెర్సీ ట్రైలర్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

