టాలీవుడ్ (Tollywood) మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah) ప్రస్తుతం మోస్ట్ క్రేజీయెస్ట్ మూవీ భోళా శంకర్ (Bholaa Shankar) లో హీరోయిన్గా నటిస్తోన్న విషయం తెలిసిందే. చిరంజీవి (Chiranjeevi) హీరోగా వస్తున్న ఈ చిత్రం గురువారం లాంఛనంగా ప్రారంభమైంది. వేదాళమ్ రీమేక్‌గా వస్తున్న మెహర్ రమేశ్(Meher Ramesh) దర్శకత్వంలో వస్తున్న ఈ ప్రాజెక్టు తమన్నా ప్లానింగ్స్ అటకెక్కేలా చేసిందట. ఈ విషయాన్ని మీడియాతో ముఖాముఖి కార్యక్రమంలో తమన్నా షేర్ చేసుకుంది.
పని నుండి ఊపిరి పీల్చుకునే అవకాశం లేకుండానే.. చాలా కాలం గడిచిపోయింది. భోళ శంకర్ సినిమా నా దగ్గరికి వచ్చినప్పుడు సెలవు తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. నేను ఎప్పటినుంచో పని చేయాలనుకునే టీం ఇదే. ఇప్పుడు నా వెకేషన్ ప్లాన్లు పాడైపోయాయి. ఈ సినిమాను ఒప్పుకున్నందుకు చింతించబోను. ఎందుకంటే మెహర్ రమేష్ నేను ఎప్పటినుంచో పని చేయాలని కోరుకునే వ్యక్తి. పలు కారణాల వల్ల ఆయనతో కలిసి పనిచేయాలన్న కల ఇప్పటివరకు నెరవేరలేదని చెప్పింది.
చిరు సినిమాలో తమన్నా కొత్త లుక్‌తో ఎలా కనిపిస్తుందోనని ఎదురుచూస్తున్న అభిమానులకు క్లారిటీ ఇస్తూ..లుక్స్, యాక్టింగ్ పరంగా నేను ఇంకా నా ఉత్తమ ప్రతిభను చూపించలేదు. ఈ చిత్రానికి ఉత్తమ పర్ఫార్మెన్స్ అందిస్తానని చెప్పుకొచ్చింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Sai Pallavi New Skill | కొత్త టాలెంట్ చూపిస్తానంటున్న సాయిపల్లవి
Adivi Sesh Vs Ravi Teja | అడివి శేష్‌కు రవితేజ సర్ప్రైజ్..పోటీ తప్పదా..?
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?