టాలీవుడ్ (Tollywood) హీరో అడివి శేష్ (Adivi Sesh) ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందా..? అని చాలా కాలంగా ఎదురుచూస్తున్న సినిమా మేజర్ (Major). మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా వస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఫిబ్రవరి వాలైంటైన్ వీక్‌లో మేజర్ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే మరో హీరో రవితేజ (Ravi Teja) ఎవ్వరూ ఊహించని విధంగా ఇదే టైంలో ఖిలాడీ (Khiladi) చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు ప్రకటించాడు.
అడివిశేష్‌కు అనుకోని విధంగా రవితేజ రిలీజ్ డేట్‌ను ప్రకటించి షాకిచ్చాడని అంతా తెగ చర్చించుకుంటున్నారు. ఖిలాడీ ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా వస్తుండగా..మేజర్ సీరియస్ కథాంశంతో తెరకెక్కింది. ఈ రెండు వేర్వేరు జోనర్ సినిమాలు కావడంతో..ప్రేక్షకుల స్పందన కూడా డిఫరెంట్‌గా ఉంటుంది. తెలుగు మార్కెట్ పరంగా రవితేజ నటించిన ఖిలాడీ, అడివిశేష్ లీడ్ రోల్ పోషించిన మేజర్‌కు పోటీనివ్వడం ఖాయమని అంటున్నారు ట్రేడ్ పండితులు.
అయితే మేజర్ సినిమా పాన్ ఇండియా మార్కెట్ పరంగా సేఫ్ జోన్లో ఉండటం మాత్రం పక్కా అనే చెప్పొచ్చంటున్నారు. మరి ఖిలాడీ రిలీజ్ నేపథ్యంలో మేజర్ సినిమా విడుదల తేదీలో ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశముందా..? అంటూ డిస్కషన్స్ నడుస్తోండగా.. ప్రస్తుతానికి అడివిశేష్ టీం అలాంటి ఆలోచన ఏం చేయదంటున్నారు సినీ విశ్లేషకులు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Nayantara or Samantha | సమంత, నయనతారలో ఇంతకీ ఎవరు ఆ ఛాన్స్ కొట్టేసేది..?
AR Rahman | రజనీకాంత్ సినిమాలకు పనిచేయడం నరకం: ఏఆర్ రెహమాన్
Kamal Haasan New Movie | అవార్డు విన్నింగ్ డైరెక్టర్‌తో కమల్‌హాసన్ కొత్త సినిమా..!
Vishwak Sen Interesting Title | ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో ‘ఫలక్‌నుమా దాస్’ కొత్త సినిమా