ఇండియాలో ఉన్న టాప్ యాక్టర్లలో ఒకడు బాలీవుడ్ (Bollywood) స్టార్ హీరో అజయ్ దేవ్గన్ (Ajay Devgan).ఈ స్టార్ యాక్టర్ మంచి నటుడే కాదు, నిర్మాత, టాలెంటెడ్ డైరెక్టర్ కూడా. ఇప్పటికే మూడు సినిమాలకు దర్శకత్వం వహించాడు అజయ్ దేవ్గన్. ఈ సారి మరో కొత్త సినిమా ప్రకటించి తన ఫాలోవర్లు, అభిమానుల్లో జోష్ నింపుతున్నాడు. ఈ చిత్రానికి భోళా (Bholaa) టైటిల్ ఫైనల్ చేశారు.
ఈ చిత్రంలో అలనాటి అందాల హీరోయిన్, హైదరాబాదీ భామ టబు (Tabu) ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. అజయ్ దేవ్ గన్ స్వీయ నిర్మాణంలో నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ముంబైలో మొదలైంది. ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో అజయ్ హోం బ్యానర్ అజయ్ దేవ్గన్ ఎఫ్ ఫిలిమ్స్ లో తెరకెక్కుతోంది. టబు, అజయ్ దేవ్గన్ కాంబినేషన్లో ఇప్పటికే మలయాళ థ్రిల్లర్ దృశ్యం (హిందీ రీమేక్)వచ్చింది.
అయితే ఈ సారి అజయ్ దేవగన్ డైరెక్షన్లో టబు నటిస్తుండటం విశేషం. 2023 మార్చి 30న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హిందీలో దీంతోపాటు మరో మూడు చిత్రాలతో బిజీగా ఉంది టబు.