బాలీవుడ్ (Bollywood) దర్శకనిర్మాత పాపులర్ టాక్ షో కాఫీ విత్ కరణ్ (Koffee With Karan) ఇక ఓటీటీలో కూడా సందడి చేయబోతున్న విషయం తెలిసిందే. తాజా సీజన్ హాట్ స్టార్‌లో జులై 7న స్ట్రీమింగ్ కానుంది. ఈ షోలో దక్షిణాది పరిశ్రమ నుంచి సమంత (Samantha) , విజయ్ దేవరకొండ లాంటి స్టార్ యాక్టర్లు సందడి చేయబోతున్నారు. ఇదిలా ఉంటే లేటెస్ట్గా నెట్టింట్లో ట్రెండింగ్ అవుతున్న ఈ షో గ్లింప్స్ వీడియోలో సామ్‌కు సంబంధించిన విషయం ఒకటి హాట్ టాపిక్ గా మారింది.
పెళ్లిళ్లపై కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నకు సామ్ చెప్పిన సమాధానం అందరి అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంటోంది. సంతోషం లేని వివాహాల (Unhappy Marriages)కు కారణం మీరే..అంటూ సమాధానమివ్వడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అంతేకాదు మీరు జీవితాన్ని K3Gగా చిత్రించారు (కరణ్ తెరకెక్కించిన కభీ కుషి కభీ ఘమ్). నిజమెంటంటో ఇది కేజీఎఫ్ అని అంటోంది సమంత. ఇంతకీ ఈ చెన్నై సుందరి ఎందుకు అలా కరణ్ జోహార్‌కు సమాధానమిచ్చిందనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.
నాగచైతన్య (Naga Chaitanya)తో విడాకుల అంశం గురించి ఈ షోలో సామ్ చెబుతుందేమో అనుకుంటున్న సినీ జనాలు.. గ్లింఫ్స్ వీడియో చూసిన తర్వాత అలాంటిదేమి ఉండకపోవచ్చని భావిస్తున్నారని ఇండస్ట్రీ సర్కిల్ టాక్. కాఫీ విత్ కరణ్ షోకు హాజరైన టాలీవుడ్ హీరోల్లో ప్రభాస్, రానా తర్వాత విజయ్ దేవరకొండనే కావడం విశేషం.
Read Also : Pavitra lokesh | నరేశ్ మంచి వ్యక్తి..మీడియాతో పవిత్రా లోకేశ్..తెరపైకి మూడో భార్య..!