బాలీవుడ్ (Bollywood) హీరోయిన్ అలియాభట్ (Alia Bhatt) రెండు రోజుల క్రితం తన ప్రెగ్నెన్సీని ప్రకటించిస్తూ..సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే. ఈ వార్త బయటకు రాగానే ప్రతీ ఒక్కరూ అలియా-రణ్‌బీర్ కపూర్ ( Ranbir Kapoor) దంపతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలియాభట్ ప్రెగ్నెన్సీ (pregnancy) నేపథ్యంలో ఆమె నటిస్తున్న ప్రస్తుత సినిమాలు ఆగిపోయే అవకాశాలున్నాయని, రణ్ బీర్ కపూర్ త్వరలోనే లండన్‌కు వెళ్లి ఆమె (అలియాభట్)ను సురక్షితంగా ఇంటికి తీసుకురానున్నాడంటూ కొందరు ట్రోల్స్ చేస్తూ కథనాలు రాసుకొచ్చారు.
అయితే ఈ వార్తలతో తీవ్రంగా అప్సెట్ అయింది అలియాభట్. సోషల్ మీడియా ద్వారా తన ఆవేదనను తెలియజేసింది. మీ సమాచారం కోసం..ఏదీ ఆలస్యం కాలేదు..ఎవరూ ఎవరినీ పికప్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నేను స్త్రీని..పార్శిల్‌ను కాదు..అని ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్‌లో రాసుకొచ్చింది. నాకు విశ్రాంతి అవసరం లేదు..కానీ నాకు డాక్టర్ సర్టిఫికేషన్ కూడా ఉంటుందని మీరంతా తెలుసుకోవడం మంచిది.
ఇది 2022వ సంవత్సరం. మనం ఈ ఆలోచనా విధానం నుండి బయటపడగలమా..? ఇప్పుడు మీరు నన్ను క్షమించినట్లయితే…నా షాట్ (షూటింగ్) సిద్ధంగా ఉంది..అంటూ రాసుకొచ్చింది.
ఈ ఏడాది ఆర్ఆర్ఆర్ సినిమాలో సీత పాత్రలో మెరిసింది అలియాభట్. ఇక రణ్‌బీర్ కపూర్‌తో కలిసి నటిస్తోన్న బ్రహ్మాస్త్ర సెప్టెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. డార్లింగ్స్ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకోగా..మరో రెండు సినిమలు చిత్రీకరణ దశలో ఉన్నాయి.