Ram marriage | ‘ఓ దేవుడా..ఆపండి’..పెళ్లి వార్తలపై హీరో రామ్
హీరో రామ్ పోతినేని (Ram Pothineni) త్వరలోనే ది వారియర్ (The Warriorr)గా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం జులై 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ సినిమాతో రామ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు. కాగా ఇదిలా ఏంటూ రామ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు రౌండప్ చేస్తున్నాయి.
టాలీవుడ్ (Tollywood) ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని (Ram Pothineni) త్వరలోనే ది వారియర్ (The Warriorr)గా ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు. ఈ చిత్రం జులై 14న థియేటర్లలో సందడి చేయనుంది. లింగుస్వామి (Lingusamy) డైరెక్ట్ చేస్తున్న ది వారియర్ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. ఈ సినిమాతో రామ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు.
కాగా ఇదిలా ఏంటూ రామ్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ సోషల్ మీడియాలో వార్తలు రౌండప్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రామ్ రియాక్ట్ అయ్యాడు. ‘ఓ దేవుడా..ఆపండి..ఇది పీక్ స్టేజీకి చేరుకుంది. పెళ్లిపై నా ఫ్యామిలీ, స్నేహితులను ఒప్పించాల్సి ఉంటుంది. నిజాయితీగా చెప్పాలంటే నేను చాలా తక్కువగా హైస్కూల్‌కు వెళ్లాను. నేను ‘ఏ సీక్రెట్ హైస్కూల్ స్వీట్హార్ట్ ‘ను పెళ్లి చేసుకోవడం లేదు..’అంటూ ట్వీట్ చేసి అందరి నోటికి తాళం వేశాడు రామ్. ఈ ట్వీట్‌తో పుకార్లకు పుల్ స్టాప్ పడింది.
ది వారియర్ చిత్రంలో కన్నడ బ్యూటీ అక్షర గౌడ కీలక పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తుండగా.. ఆది పినిశెట్టి విలన్‌గా నటిస్తున్నాడు. మరోవైపు మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కూడా ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు రామ్. ది వారియర్ విడుదలైన తర్వాత బోయపాటి ప్రాజెక్టును రామ్ సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నాడు.
Oh God! Stop! …it’s reached a point wherein I’m having to convince my own family & friends that I’m not getting married to any “secret high school sweetheart”!
TBH,I hardly went to high school..🤷♂️🙏
— RAm POthineni (@ramsayz) June 29, 2022
Read Also : Hema Chandra | పనికిమాలిన విషయమే తొందరగా వ్యాపిస్తుంది..విడాకులపై హేమచంద్ర
Read Also : Sharwanand | హ్యాపీ మూడ్‌లో శర్వానంద్..కారణమిదే
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhyapradesh | ఉజ్జయినిలో పెను విషాదం.. విషవాయువు పీల్చి నలుగురు హోటల్ కార్మికులు మృతి
RC 17 Begins | పాన్-ఇండియా రేంజ్లో రామ్‌చరణ్ – సుకుమార్ కొత్త సినిమా ప్రారంభం.. క్లాప్ కొట్టిన చిరు!
Jagan helicopter | వైఎస్ జగన్‌పై చంద్రబాబు సర్కార్ కుట్రలు? జగన్ హెలికాప్టర్ ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీలో కాజోల్.. బాలకృష్ణతో కలిసి కీలక పాత్రలో కనిపించనున్నారా?
Irumudi | రవితేజ ‘ఇరుముడి’ నిర్మాతలకు తెలంగాణ కార్మిక శాఖ నోటీసులు.. బాలనటి నిబంధనలపై విచారణకు ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

