ఈ ఏడాది గ్లోబల్ బాక్సాపీస్ను షేక్ చేసిన భారతీయ చిత్రాల్లో టాప్లో ఉంటుంది ఆర్ఆర్ఆర్ (RRR). ఆ తర్వాత కేజీఎఫ్ 2 నిలిచింది. కాగా ఐఎండీబీ (ఇంటర్నెట్ మూవీ డాటాబేస్) టాప్ 250 ఇండియన్ ఫిల్మ్స్ జాబితా (RRR)లో ఈ ఏడాది కొన్ని చిత్రాలే చోటు సంపాదించుకోవడం గమనార్హం. ఈ ప్రతిష్టాత్మక జాబితాలో టాలీవుడ్ నుంచి ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన పాన్ ఇండియా ప్రాజెక్టు ఆర్ఆర్ఆర్ 169వ స్థానంలో నిలిచింది. ఇక రెండు కన్నడ చిత్రాలు ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ను అధిగమించడం విశేషం.
వాటిలో ఒకటి ప్రశాంత్ నీల్-యశ్ కాంబినేషన్లో వచ్చిన పాన్ ఇండియా సినిమా కేజీఎఫ్ 2 (KGF-2)కాగా..రెండోది కన్నడ హీరో రక్షిత్ శెట్టి నటించిన 777 చార్లి (777 Charlie). కేజీఎఫ్ 2 ఈ జాబితాలో 101వ స్థానంలో నిలువగా..777 చార్లి 116వ స్థానంలో నిలిచింది. 777 చార్లి ఐఎండీబీ రేటింగ్లో 9000 ఓట్లతో 9.2/10 సంపాదించింది. ఈ కన్నడ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్స్ అయిన బజరంగీ భాయ్ జాన్, దిల్ వాలే దుల్హానియా లే జాయెంగే, బాహుబలి, కేజీఎఫ్ 1, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ చిత్రాలను కూడా మించిపోవడం విశేషం.
కే కిరణ్ రాజ్ డైరెక్షన్లో వచ్చిన 777 చార్లి ధర్మ అనే వ్యక్తి జీవితంలోకి చార్లీ అనే కుక్క (పెట్) ప్రవేశించి.. అతన్ని జీవితాన్నిఎలా మార్చేసిందనే కథాంశంతో తెరకెక్కింది. జూన్ 10న విడుదలైన ఈ చిత్రం బాక్సాపీస్ వద్ద పాజిటివ్ టాక్తోపాటు విమర్శకుల ప్రశంసలు అందుకుంది.