బాహుబలి ప్రాంచైజీ (baahubali franchise)సినిమాలు బాక్సాపీస్ వద్ద ఏ రేంజ్లో కలెక్షన్లు రాబట్టాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ సినిమాలను హిందీలో అనిల్ థడని (AA Films) డిస్ట్రిబ్యూషన్ చేయగా..మంచి కాసుల వర్షం కురిపించాయి. తాజాగా మరోసారి ఈ బాహుబలి డిస్ట్రిబ్యూటర్ (Anil Thadani)జాక్ పాట్ కొట్టేశాడన్న వార్త హాట్ టాపిక్‌గా మారింది. కార్తీక్ ఆర్యన్ (Karthik Aaryan), కియారా అద్వానీ కాంబినేషన్లో వచ్చిన చిత్రం భూల్ భూలయ్యా 2 (Bhool Bhulaiyaa 2).
హార్రర్ కామెడీ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ప్రాజెక్టు హిందీ బాక్సాపీస్ (Hindi BO)వద్ద విడుదలైన రోజు నుంచి ఇప్పటివరకు కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. ఈ మూవీ 5 వారాల్లో రూ.180 కోట్లు వసూళ్లు చేసి..ఇప్పటికీ సక్సెస్‌ఫుల్‌గా స్క్రీనింగ్ అవుతోంది. కేవలం ఒక్క ముంబైలోనే రూ.55 కోట్లు సాధించగా..ఢిల్లీ/యూపీ బెల్ట్‌లో రూ.45 కోట్లు రాబట్టి..ఈ సినిమాను పంపిణీ చేసిన అనిల్ థడనికి కలెక్షన్ల పంట పండిందని బాలీవుడ్ ట్రేడ్ సర్కిల్లో జోరుగా టాక్ నడుస్తోంది.
అయితే భూల్ భూలయ్యా 2 నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కావడం థియేటర్ల స్క్రీనింగ్ పై ప్రభావం చూపుతోందట. ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టడంతో నిర్మాత భూషణ్ కుమార్ (AA Films)రూ.4.7 కోట్లు ఖరీదైన McLaren GT కారును కార్తీక్ ఆర్యన్‌కు బహుమతిగా అందించడం టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచింది. ఈ క్రేజీ చిత్రానికి కొనసాగింపు ఉండనుందని టాక్ కూడా వినిపిస్తోంది.