టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని (Ram Pothineni) ప్రస్తుతం లింగుస్వామి ( Lingusamy) డైరెక్షన్లో చేస్తున్న చిత్రం ది వారియర్( The Warriorr). కృతిశెట్టి హీరోయిన్గా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ మూవీ జులై 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా విడుదల కాకముందే స్టార్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో కూడా సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కాగా యువ హీరోకు సంబంధించిన వార్త ఒకటి ఇపుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది. త్వరలో మరో స్టార్ డైరెక్టర్‌తో సినిమా చేయబోతున్నాడన్న న్యూస్ ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.
పవన్ కల్యాణ్‌కు గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బాస్టర్ హిట్టు ఇచ్చిన హరీష్ శంకర్ (Harish Shankar)తో రామ్ సినిమా చేయబోతున్నాడట. ప్రస్తుతం ఈ సినిమాపై చర్చలు కొనసాగుతున్నాయని, అన్నీ కుదిరితే త్వరలోనే అధికారిక ప్రకటన కూడ ఉండబోతుందని జోరుగా టాక్ నడుస్తోంది. రీసెంట్గా పవన్ కల్యాణ్‌తో చేయబోతున్న భవదీయుడు భగత్ సింగ్ వాయిదా పడుతుందని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఇదే టైంలో రామ్ సినిమా టాపిక్ రావడం టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. మరి ఈ ఇద్దరి కాంబినేషన్లో వర్కవుట్ అవుతుందా..? అనేది రానున్నరోజుల్లో తెలియనుంది.
రామ్ కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ది వారియర్ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) మ్యూజిక్ డైరెక్టర్. ఈ చిత్రంలో కన్నడ భామ అక్షర గౌడ కీ రోల్లో నటిస్తోంది. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి సిల్వర్ విలన్‌గా నటిస్తున్నాడు.