గౌతమ్ ఎస్ఎస్సీతో సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా పరిచయమయ్యాడు నవదీప్ (Navdeep). ఆ తర్వాత చందమామ, ఆర్య 2 సెకండ్ మెయిన్ లీడ్స్ లో నటించి..మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ యువ నటుడికి ఓ స్టార్ హీరో ఖరీదైన కానుక అందించాడు. ఆ ప్రత్యేక కానుకను ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేస్తూ..తన సంతోషాన్ని షేర్ చేసుకున్నాడు. ఇంతకీ ఆ స్టార్ ఎవరనే కదా మీ డౌటు. ఇటీవలే పుష్ప సినిమాతో అద్బుతమైన సక్సెస్ అందుకున్న అల్లు అర్జున్ (Allu Arjun). నవదీప్‌కు ఎయిర్‌పొడ్స్ (Airpods)కానుకగా పంపించాడు బన్నీ.
సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన ఆర్య 2 చిత్రంలో అల్లు అర్జున్-నవదీప్ క్లోజ్ ఫ్రెండ్స్ గా నటించారు. ఈ క్రేజీ సినిమాలో బన్నీ-నవదీప్ మధ్య వచ్చే చాలా సీన్లను ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఇక ఆర్య 2తో నవదీప్-అల్లు అర్జున్ మధ్య స్నేహబంధం మరింత పెరిగింది. ప్రేమకు హద్దులు లేకుంటే..ఒకేషన్ ఏమీ లేకున్నా (సందర్భానుసారంగా కాకుండా) బహుమతులు వస్తే. ధన్యవాదాలు అర్జున్ బావ్స్.ఈ సమాజం ఒప్పుకోకపోయినా ఆండ్రాయిడ్‌తో ఎయిర్‌పొడ్స్ వాడతా అంటూ క్యాప్షన్ ఇచ్చాడు నవదీప్.
నవదీప్ నెక్ట్స్ అవనీంద్ర డైరెక్ట్ చేస్తున్న లవ్ మౌలీ సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే థియేటర్లలో విడుదల కానుంది ఈ చిత్రం. మరోవైపు అల్లు అర్జున్-సుకుమార్ డైరెక్షన్లో రాబోతున్న పుష్ప 2ను లైన్లో పెట్టాడు.