Vikram All time Records | కమల్హాసనా మజాకా..విక్రమ్ మల్టీపుల్ ఆల్‌టైమ్ రికార్డ్స్..!
యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్ పోషించిన విక్రమ్ (Vikram) జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీతోపాటు పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది. లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ తొలి రోజు నుంచి ఇప్పటివరకు బాక్సాపీస్ వద్ద నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కాసుల పంట పండిస్తోంది.
ఈ మధ్యకాలంలో విడుదలైన రోజు నుంచి ఏదో ఒక క్రేజీ అప్డేట్తో వార్తల్లో నిలుస్తున్న తమిళ సినిమా ఏదైనా ఉందా..అంటే ఠక్కున గుర్తొచ్చే చిత్రం విక్రమ్ (Vikram). యూనివర్సల్ హీరో కమల్ హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్ పోషించిన ఈ చిత్రం జూన్ 3న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీతోపాటు పలు భాషల్లో గ్రాండ్‌గా విడుదలైంది.
తమిళ స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో వచ్చిన విక్రమ్ తొలి రోజు నుంచి ఇప్పటివరకు బాక్సాపీస్ వద్ద తన మేనియా చూపిస్తూ..భాషతో సంబంధం లేకుండా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు కాసుల పంట పండిస్తోంది. ఇంటర్నేషనల్ మార్కెట్‌ను షేక్ చేసిన పాన్ ఇండియా ప్రాజెక్టు బాహుబలి 2 రికార్డు (తమిళ వెర్షన్ ఐదేళ్ల రికార్డు)ను సైతం బ్రేక్ చేసి అరుదైన ఫీట్ సాధించింది విక్రమ్. విక్రమ్ కేరళలో అత్యధిక గ్రాస్ సాదించిన తమిళ చిత్రంగా నిలిచింది.
అంతేకాదు తమిళనాడులో ఇటీవల కాలంలో హయ్యెస్ట్ గ్రాస్‌తోపాటు అత్యధిక షేర్ రాబట్టిన సినిమాగా రికార్డుల్లోకెక్కింది. ఈ చిత్రం దేశీయ మార్కెట్లోనే కాదు గ్లోబల్ మార్కెట్లో కూడా తన సత్తా చూపిస్తోంది. ట్రేడ్ సర్కిల్ టాక్ ప్రకారం యూకే, యూఏఈ, సింగపూర్లలో అత్యధిక గ్రాస్ సాధించిన తమిళ చిత్రంగా అరుదైన మార్కు సొంతం చేసుకుంది. మొత్తానికి ఇప్పటికీ చాలా ప్రాంతాల్లో స్క్రీనింగ్ అవుతూ మల్టీపుల్ ఆల్‌టైమ్ రికార్డ్స్‌ను సొంతం చేసుకుంటూ బాక్సాపీస్ ను షేక్ చేస్తున్నాడు కమల్ హాసన్.
ఈ చిత్రం జులై 8న Disney+ Hotstar ఓటీటీ ప్లామ్ ఫాంలో స్ట్రీమింగ్ కానుంది. విక్రమ్ చిత్రాన్ని రాజ్‌కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్-మహేంద్రన్ సంయుక్తంగా నిర్మించారు. కోలీవుడ్ స్టార్ హీరోలు విజయ్ సేతుపతి, సూర్య, మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, కీలక పాత్రల్లో నటించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ డైరెక్టర్.
Read Also : Hema Chandra | పనికిమాలిన విషయమే తొందరగా వ్యాపిస్తుంది..విడాకులపై హేమచంద్ర
Read Also : Sharwanand | హ్యాపీ మూడ్‌లో శర్వానంద్..కారణమిదే
Read Also : Raashi Khanna | రొమాన్స్ సులభం..కామెడీ చాలా కష్టమంటున్న రాశీఖన్నా
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

