Puri Jagannath | పూరీ ఇంతకీ న్యూడ్ పోస్టర్‌ను ఎందుకు రిలీజ్ చేశాడో..?
ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టు లైగర్(Liger)పైనే తన ఫోకస్ అంతా పెట్టాడు పూరీ జగన్నాథ్ (Puri Jagannath). అయితే పూరీ ఎవరూ ఊహించని విధంగా అందరికీ షాకిస్తూ విడుదల చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది.
టాలీవుడ్ (Tollywood) డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ (Puri Jagannath) ప్రస్తుతం పాన్ ఇండియా ప్రాజెక్టు లైగర్(Liger)పైనే తన ఫోకస్ అంతా పెట్టాడు. ఆగస్టులో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే పూరీ ఎవరూ ఊహించని విధంగా అందరికీ షాకిస్తూ విడుదల చేసిన ఓ పోస్టర్ ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. ఇంతకీ ఆ పోస్టరేంటో ఇప్పటికే అర్థమై ఉంటుంది. అచ్చు కాలీప్లవర్ సినిమాలో సంపూర్ణేశ్ బాబులా విజయ్ దేవరకొండ న్యూడ్‌గా (VDk nude poster) కనిపిస్తూ..చేతిలో పూల బొకే పట్టుకుని కనిపిస్తున్న పోస్టర్ నెట్టింట్లో హల్ చల్ చేస్తోంది.
అయితే అందరి మాటెలా ఉన్నా..ఈ పోస్టర్‌ను చూసి ట్రోలర్స్ మాత్రం పండగ చేస్కుంటున్నారు. ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ పూరీ రిలీజ్ చేసిన పోస్టర్ చూసి అసహనం వ్యక్తం చేస్తుంటే..మరికొంత మంది మాత్రం ఇంతకీ పూరీ ఇలాంటి పోస్టర్ ఎందుకు విడుదల చేసి ఉంటాడో అని చర్చించుకుంటున్నారు. దీనికి వెనుక అసలు సీక్రెట్ వేరే ఉందంటూ సినీజనాలు అనుకుంటున్నారు. సాధారణంగా రిలీజ్ డేట్ దగ్గర పడుతుందంటే ప్రమోషన్స్ ప్లాన్ కూడా మొదలుపెట్టాల్సిందే కదా.
సినిమాను ఎంత కొత్తగా పబ్లిసిటీ (publicity) చేస్తే అంత ఎక్కువ ప్రచారం వస్తుందని తెలిసిందే. ఇందులో భాగంగానే పూరీ అందరి నోళ్లలో ఈ సినిమా నానాలని ఇలా చేశాడంటూ ప్రచారం నడుస్తోంది. అయితే ఇలాంటి స్టంట్ పాన్ ఇండియా స్థాయిలో కూడా కొత్తేమీ కాదు.ఎందుకంటే చాన్నాళ్ల క్రితమై స్టార్ హీరో అమీర్ ఖాన్ నటించిన పీకే చిత్రం కోసం ఇలాంటి స్టంట్‌నే వాడారు. అప్పట్లో ప్రేక్షకులకు అది చాలా ఫ్రెష్‌గా అనిపించడమే కాదు..సినిమాకు మంచి పబ్లిసిటీ కూడా తెచ్చి పెట్టింది.
మరి ఇపుడు అదే ఫార్ములాను పూరీ ఇలా లైగర్ కోసం వాడటం వర్కవుట్ అయ్యేనా..? అంటూ మరో డిస్కషన్ కూడా వినిపిస్తోంది. ఏదేమైనా పోస్టర్‌పై నెగెటివ్ కామెంట్స్ వచ్చినా..పాజిటివ్ కామెంట్స్ వచ్చినా..అందరి నోళ్లలో మాత్రం నానడం పక్కా. అంటే ఏదో రకంగా పబ్లిసిటీ అవుతున్నట్టే లెక్క. మరి పూరీ నిజంగా పబ్లిసిటీ కోసమే ఇలా చేశాడన్నది నిజమే అయితే సినిమాకు ప్రమోషన్స్ కు ఉపయోగపడినట్టే లెక్క అంటున్నారు సినీ జనాలు.
Read Also : Gopichand | సూర్య డైరెక్టర్‌తో గోపీచంద్ కొత్త సినిమా..క్రేజీ న్యూస్‌లో నిజమెంత ?
Read Also : Vignesh Nayan | విఘ్నేశ్-నయన్ స్వీట్ హగ్..ట్రెండింగ్‌లో స్టిల్
Read Also : Akshay Kumar | అమీర్ ఖాన్‌తో మళ్లీ ఫైట్..అక్షయ్‌కుమార్ ఏమన్నాడంటే..?
Read Also : Pavitra lokesh | నరేశ్ మంచి వ్యక్తి..మీడియాతో పవిత్రా లోకేశ్..తెరపైకి మూడో భార్య..!
Read Also : Alia Bhatt | ‘నేను స్త్రీని..పార్శిల్‌ను కాదు..’ట్రోల్స్ పై అలియాభట్
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

