ఐదు పదుల వయస్సు దగ్గరికొస్తున్నా వన్నె తరగని అందంతో మెస్మరైజ్ చేస్తుంటుంది బాలీవుడ్ (Bollywood) భామ మలైకా అరోరా (Malaika Arora). ఈ డ్యాన్సింగ్ బ్యూటీ మంచి ఫిట్నెస్ ఎక్స్పర్ట్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఎంత బిజీగా ఉన్నా డైలీ టైం టేబుల్లో యోగా, జిమ్ సెషన్ ఉండేలా చూసుకుంటుంది మలైకా. ఈ భామ ఎప్పటికపుడు కొత్తగా కనిపిస్తూ..కుర్రకారు మనసు దోచేస్తుంటుంది.
ముంబైలోని ఓ జిమ్ సెంటర్ (Malaika gym)లోకి వెళ్తుండగా తీసిన వీడియో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్ అవుతోంది. బ్లాక్ బ్రాలెట్టే, గ్రే షార్ట్స్ లో చేతిలో బాటిల్ పట్టుకుని వెళ్తున్న మలైకాను అక్కడే ఉన్న కెమెరామెన్లు తమ కెమెరాలో బంధించారు. పర్ఫెక్ట్ ఫిట్నెస్ను మెయింటైన్ చేస్తూ కొత్త హీరోయిన్లకు గట్టిపోటీనిస్తూ..వారికి నిద్రపట్టకుండా చేస్తోంది మలైకా అరోరా.
ఫిట్నెస్, యోగా పాఠాలు, టీవీ షోలకే పరిమితమైన మలైకా సిల్వర్ స్క్రీన్‌పై కనిపించక చాలా కాలమే అవుతుంది. మలైకా తాజా వీడియో ఆన్ లైన్లో హల్ చల్ చేస్తోంది.