Mr Bachchan | టాలీవుడ్ యాక్టర్ రవితేజ (Ravi Teja) టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ (Mr Bachchan). హరీష్ శంకర్ (Harish Shankar) మరోసారి దర్శకత్వం వహించాడు. షాక్, మిరపకాయ్ చిత్రాల తర్వాత రవితేజ-హరీష్ శంకర్ కాంబోలో మూడోసారి వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ రెస్పాన్స్ రాబట్టుకుంటోంది. కాగా మిస్టర్ బచ్చన్‌లో
సర్ప్రైజ్ ఎంట్రీస్ ప్రేక్షకులకు థ్రిల్ అందిస్తున్నట్టు ఇప్పటివరకు వచ్చిన టాక్ చెబుతోంది. డీజే టిల్లు హీరో సిద్దు జొన్నలగడ్డ ఎంట్రీతో థియేటర్లు కేరింతలతో హోరెత్తిపోతున్నాయి. ఎనర్జిటిక్‌గా సాగే నల్లంచు తెల్లచీర పాటలో రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎంట్రీ ఇస్తాడు. ఇక ఇప్పటికే పలు సినిమాల్లో యాక్టర్‌గా మెరిసిన పాపులర్ స్క్రీన్ రైటర్, డైరెక్టర్ బీవీఎస్ రవి కూడా ఓపెనింగ్ సీన్లలో కనిపిస్తాడు. సిద్దు జొన్నలగడ్డ ఐదు నిమిషాల్లోపే కనిపించినా.. పక్కా ఎంటర్టైనింగ్గా సాగే సన్నివేశాలతో ప్రేక్షకులను ఎక్జయిటింగ్‌కు లోనయ్యేలా చేస్తున్నాడు.
ఈ చిత్రంలో భాగ్య శ్రీ బోర్సే ఫీ మేల్ లీడ్ రోల్లో నటించింది. ఈ చిత్రానికి ఇమిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ తెరకెక్కించారు.
Read Also :
Tirumala Temple | తిరుమల శ్రీవారి సేవలో మహేశ్ బాబు కుటుంబం
Mr Bachchan | ప్రభాస్ అభిమానులకు రవితేజ మిస్టర్ బచ్చన్ టీం స్పెషల్ ట్రీట్.. !
Chiyaan Vikram | స్వేచ్చ కోసం చేసే పోరాటం.. తంగలాన్ గురించి చియాన్ విక్రమ్ ఏమన్నాడంటే..?