Chiyaan Vikram | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) నటిస్తోన్న తాజా చిత్రం తంగలాన్ (Thangalaan). పా రంజిత్ దర్శకత్వంలో హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ చిత్రంలో మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ మూవీ మరికొన్ని గంటల్లో (ఆగస్టు 15న) ప్రపంచవ్యాప్తంగా తెలుగు,తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలో విక్రమ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నాడు.
చిట్‌చాట్‌లో విక్రమ్ ఆసక్తికర విషయాలు షేర్ చేసుకున్నాడు. తంగలాన్ తెలుగు, తమిళ, కన్నడ అని కాదు.. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ రిలేట్ అయ్యే కథ అన్నాడు విక్రమ్. సినిమాలో బంగారం వేట అనేది హైలైట్ అవుతున్నా. ఈ కథలో స్వేచ్ఛ కోసం చేసే పోరాటం ఉంది. దీన్ని ఏదో ఒక వర్గానికి ఆపాదించలేం. మన జీవితాల్లో కూడా ఎప్పుడో ఒకప్పుడు అసమానతలకు గురవుతుంటాం. డైరెక్టర్ పా రంజిత్ అలాంటి వారి కోసం సినిమా అనే మాధ్యమం ద్వారా తన అభిప్రాయాలు చెబుతున్నారు. సార్పట్ట సినిమా చూసినప్పుడు ఆ కథలోకి లీనమవుతాం గానీ మిగతా విషయాలను పట్టించుకోం. అలాగే తంగలాన్ కథ కూడా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలో ఎవరినీ ఇబ్బంది పెట్టే పేర్లు, మాటలు ఉండవు. డైరెక్టర్ పా రంజిత్ ఆ జాగ్రత్తలు తీసుకున్నారన్నాడు.
తంగలాన్ అనేది ఒక తెగ పేరు. ఈ సినిమాలో నా క్యారెక్టర్ లుక్స్ చూసినప్పుడు ఒక్కోసారి ఒక్కో అంచనాలు ఏర్పడ్డాయి. ఫస్ట్ టైమ్ లుక్ రిలీజ్ చేసినప్పుడు ఇది కేజీఎఫ్‌లా ఉంటుందా అన్నారు. మరోసారి తెగ నాయకుడి గెటప్ విడుదల చేసినప్పుడు ఇది రా అండ్ రస్టిక్‌గా ఉంటుందన్నారు. కానీ తంగలాన్‌లో అన్ని అంశాలున్నాయని చెప్పుకొచ్చాడు విక్రమ్.
ఈ చిత్రంలో పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదల చేసిన తంగలాన్ వార్ సాంగ్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు.
Thangalaan | భారీ సక్సెస్.. విక్రమ్ తంగలాన్పై కంగువ యాక్టర్ సూర్య
Venkatesh | మాజీ పోలీసాఫీసర్‌గా వెంకటేశ్ బ్యాక్ టు యాక్షన్.. SVC58 క్రేజీ న్యూస్
Double iSmart | డబుల్ ఇస్మార్ట్ స్టైల్లో యాక్షన్ పార్ట్.. రామ్ ప్రాక్టీస్ సెషన్ చూశారా..?