Thangalaan | కోలీవుడ్ స్టార్ హీరో చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) కాంపౌండ్ నుంచి వస్తోన్న చిత్రం తంగలాన్ (Thangalaan). హిస్టారికల్ డ్రామా నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీకి పా రంజిత్ దర్శకత్వం వహిస్తున్నాడు. మాళవికా మోహనన్, పార్వతి తిరువొత్తు ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. ఈ మూవీ మరికొన్ని గంటల్లో (ఆగస్టు 15న) ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విక్రమ్ టీంకు కంగువ యాక్టర్ సూర్య ఆల్ ది బెస్ట్ చెప్పాడు.
ఈ విజయం భారీ స్థాయిలో ఉండబోతుందని ట్వీట్ చేశాడు సూర్య. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్)లో జరిగే ఘటనల నేపథ్యంలో విక్రమ్ థ్రిల్లింగ్, అడ్వెంచరస్ రైడ్‌గా వస్తోన్న ఈ చిత్రంలో పశుపతి, డానియెల్ కల్టగిరోన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీ నుంచి విడుదల చేసిన తంగలాన్ వార్ సాంగ్ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తోంది.
ఈ చిత్రాన్ని స్టూడియో గ్రీన్, నీలమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కేఈ జ్ఞానవేళ్ రాజా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రానికి జీవీ ప్రకాశ్ కుమార్ మ్యూజిక్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే తంగలాన్ నుంచి షేర్ చేసిన విక్రమ్, మాళవికా మోహనన్ ఫస్ట్ లుక్ పోస్టర్లు సినిమాపై అంచనాలు అమాంతం పెంచేస్తున్నాయి. బంగారం, రక్తం, కన్నీటి చుట్టూ సాగే కథగా అడ్వెంచరస్ స్టోరీ నేపథ్యంలో తంగలాన్ ఉండబోతుంది.
#Thangalaan…!
THIS WIN WILL BE HUGE!! @chiyaan @beemji @parvatweets @MalavikaM_ @gvprakash @NehaGnanavel @GnanavelrajaKe @OfficialNeelam@StudioGreen2 @SakthiFilmFctry pic.twitter.com/nNij8gwqqb— Suriya Sivakumar (@Suriya_offl) August 14, 2024
Venkatesh | మాజీ పోలీసాఫీసర్‌గా వెంకటేశ్ బ్యాక్ టు యాక్షన్.. SVC58 క్రేజీ న్యూస్
Double iSmart | డబుల్ ఇస్మార్ట్ స్టైల్లో యాక్షన్ పార్ట్.. రామ్ ప్రాక్టీస్ సెషన్ చూశారా..?
Ravi Teja | సుమ, భాగ్య వీళ్లే ఫొటో తీయండి.. మిస్టర్ బచ్చన్ ప్రమోషన్స్‌లో రవితేజ