Double ISMART | టాలీవుడ్ యాక్టర్ రామ్ పోతినేని (Ram Pothineni) టైటిల్ రోల్లో నటిస్తున్న చిత్రం డబుల్ ఇస్మార్ట్ (Double iSmart). పూరీజగన్నాథ్ దర్శకత్వంలో ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా వస్తోన్న ఈ మూవీలో కావ్య థాపర్ హీరోయిన్గా నటిస్తోంది. డబుల్ ఇస్మార్ట్ ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో పూరీ అండ్ రామ్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ఆసక్తికర అప్డేట్ ఒకటి షేర్ చేశారు మేకర్స్. ఈ చిత్రాన్ని తమిళనాడులో పాపులర్ ఫిలిం డిస్ట్రిబ్యూషన్ కంపెనీ శక్తి ఫిలిం ఫ్యాక్టరీ విడుదల చేస్తుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. లైగర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్‌కు సీక్వెల్‌గా వస్తోన్న తాజా ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ట్రెండ్ క్రియేట్ చేస్తుందనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
ఇప్పటికే ధిమాక్కిరికిరి డబుల్ ఇస్మార్ట్ టీజర్ నెట్టింట టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తోండగా.. డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్ కూడా ఇంప్రెసివ్‌గా సాగుతూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతోంది. ఈ మూవీలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ విలన్‌గా నటిస్తున్నాడు. పూరీ కనెక్ట్స్ బ్యానర్ తెరకెక్కిస్తోన్న ఈ మూవీ ఆడియో హక్కులను పాపులర్ మ్యూజిక్ లేబుల్ ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకుంది.
#DoubleISMART Tamilnadu Delease By @SakthiFilmFctry 🤙🔥
Stars : Ram Pothineni – Sanjay Dutt
Music : Mani Sharma (Pokkiri)
Direction : Puri Jagannadh (LIGER)AUGUST 15 Theatrical Release!! pic.twitter.com/zcKTOZjNH2
— Saloon Kada Shanmugam (@saloon_kada) August 13, 2024
Vijay Sethupathi | ఆ టైంలో మహేశ్‌బాబు సినిమా చూసేవాడిని : విజయ్ సేతుపతి కామెంట్స్ వైరల్
The Greatest of all time | డిఫరెంట్ థీమ్‌తో పోస్టర్లు.. విజయ్ ది గోట్ మేకర్స్ ప్లాన్ అదిరింది..!