Vijay Sethupathi | కోలీవుడ్ నుంచి పాన్ ఇండియా ఇమేజ్ ఉన్న యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi). తెలుగు, తమిళం, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ వన్ ఆఫ్ ది లీడింగ్ హీరోగా కొనసాగుతున్నాడు మక్కళ్ సెల్వన్. ఈ ఏడాది నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించిన మహారాజ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. షార్ట్ ఫిలిమ్స్‌తో కెరీర్ మొదలుపెట్టిన విజయ్ సేతుపతి స్టార్ యాక్టర్‌గా మారేందుకు చాలా సంవత్సరాలే కష్టపడ్డాడు.
కాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని షేర్ చేసుకున్నాడు విజయ్ సేతుపతి. కెరీర్ తొలినాళ్లలో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో తాను మహేశ్ బాబు (Mahesh babu) నటించిన అతడు (Athadu) సినిమాను తరచూ చూసేవాడినని చెప్పుకొచ్చాడు. సినిమాలో మహేశ్ బాబు ఎంట్రీ నుంచి శుభం కార్డు పడే వరకు ప్రతీ సన్నివేశం చాలా ప్రత్యేకమైంది. అతడులో త్రివిక్రమ్ భావోద్వేగాలను పండించిన తీరు అద్భుతం. మహేశ్ బాబు, త్రిష రొమాన్స్ కూడా బాగుంటుందని చెప్పుకొచ్చాడు. ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అతడు చిత్రానికి మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించాడు. విజయ్ సేతుపతి ప్రస్తుతం Gandhi Talks, విడుదల పార్ట్ 2 సినిమాలతో బిజీగా ఉన్నాడు.
Chiyaan Vikram | అపరిచితుడు విజయవాడలోనే ఎక్కువ రోజులు ఆడింది.. తంగలాన్ ప్రమోషన్స్‌లో విక్రమ్
Nayanthara | మహారాజ డైరెక్టర్‌తో నయనతార.. సినిమా టైటిల్ ఇదే
Gabbar Singh 4K | గబ్బర్ సింగ్‌తో అదే ట్రెండ్ సెట్ చేయబోతున్న పవన్ కల్యాణ్..!
Abhishek Bachchan | ఐశ్వర్యారాయ్‌తో విడాకులు.. అభిషేక్ బచ్చన్ రియాక్షన్ ఇదే…!