Abhishek Bachchan | ఫిలిం ఇండస్ట్రీలో స్టార్ కపుల్స్ విడాకుల వార్తలు కొత్తేమీ కాదు. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్‌తోపాటు మిగిలిన పరిశ్రమల్లో కూడా ఎప్పుడూ ఏదో ఒక సెలబ్రిటీల విడాకుల వార్తలు తెరపైకి వస్తూనే ఉంటాయి. వీటిలో కొన్ని నిజమైతే చాలా వరకు పుకార్లుగానే మిగిలి పోతాయి. తాజాగా మరో విడాకుల వార్త ఒకటి నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai) ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీల్లో వన్ ఆఫ్ ది టాప్ స్టార్ అని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ మాజీ మిస్ వరల్డ్ అభిషేక్ బచ్చన్ సతీమణిగా, బిగ్ బీ కోడలిగా సక్సెస్‌ఫుల్‌గా ఫ్యామిలీ లైఫ్‌ను కొనసాగిస్తోంది. అయితే ఇటీవల జరిగిన అనంత్ అంబానీ వెడ్డింగ్ ఈవెంట్‌కు ఐశ్వర్యారాయ్ తన కూతురుతో కలిసి సింగిల్‌గా హాజరైంది. దీంతో ఐష్ తన భర్త అభిషేక్ బచ్చన్ (Abhishek Bachchan) తో విడిపోతుందని.. ఐష్ అత్తవారింట్లో మనస్పర్థలు రావడంతో అభిషేక్ బచ్చన్ ఇంటి నుంచి బయటకు వచ్చి విడిగా ఉంటోందంటూ పుకార్లు షికారు చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో అభిషేక్ బచ్చన్ స్పందించాడు. క్షమించండి.. నేనిప్పటికీ పెళ్లి చేసుకునే ఉన్నా.. అంటూ రిప్లై ఇచ్చి విడాకుల రూమర్లకు చెక్ పెట్టేశాడు. ఇటీవలే పారిస్ 2024 ఒలంపిక్స్ లో సందడి చేసిన అభిషేక్ బచ్చన్ యూకే మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వెడ్డింగ్ రింగ్‌ను చూపిస్తూ తాను సంతోషంగా పెళ్లి చేసుకున్నానని చెప్పాడు. మొత్తానికి ఈ వార్తలు ఫేక్ అని అభిషేక్ బచ్చన్ రియాక్షన్‌తో క్లారిటీ వచ్చేసినట్టేనని అర్థమవుతోంది.