Gabbar Singh 4K | సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బర్త్ డేను ఘనంగా జరిపేందుకు అభిమానులు రెడీ అవుతున్నారు. పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా బ్యాక్ టు బ్యాక్ సినిమాల ట్రీట్స్ ఉండబోతున్నాయని ఇప్పటికే నెట్టింట వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ క్రేజీ ట్రీట్స్‌లో ఒకటి గబ్బర్ సింగ్ 4k (Gabbar Singh 4k) రీరిలీజ్. సుదీర్ఘకాలంగా సరైన బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న పవన్ కల్యాణ్‌కు గబ్బర్ సింగ్ రూపంలో కెరీర్‌ను మలుపు తిప్పే ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించాడు హరీష్ శంకర్.
దబాంగ్‌కు రీమేక్‌గా బండ్ల గణేశ్ నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టింది. కాగా ఇప్పుడు రీరిలీజ్ విషయంలో కూడా గబ్బర్ సింగ్ అదే ట్రెండ్‌ను కొనసాగించబోతున్నట్టు తాజా వార్త ఒకటి స్పష్టం చేస్తోంది. నార్త్ అమెరికాలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతుందట. తాజా టాక్ ప్రకారం నార్త్ అమెరికాలో 100+ లొకేషన్లకుపైగా విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 1న యూఎస్ఏ, కెనడాలో హాలీడే కావడం వల్ల ఓపెనింగ్ డేన రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పవన్ కల్యాణ్ మొత్తానికి సినిమాలో చెప్పినట్టుగానే తాను ట్రెండ్ ఫాలో అవ్వను.. సెట్ చేస్తానని చెప్పకనే చెబుతున్నాడని అంటున్నారు సినీ జనాలు.
ఏపీ డిప్యూటీ సీఎంగా అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టిన నేపథ్యంలో కొంతకాలం వరకు కొత్త సినిమాలేవి విడుదలయే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో మరి గబ్బర్ సింగ్ నయా వెర్షన్‌ను ఎంజాయ్ చేసే అవకాశం మిస్ చేసుకోవద్దని చెబుతున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ చిత్రంలో శృతి హాసన్ ఫీ మేల్ లీడ్ రోల్లో నటించగా.. బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, అభిమన్యు సింగ్ కీలక పాత్రలు పోషించారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అదిరిపోయే ఆల్బమ్ అందించాడు.
Chiranjeevi | కల్కి 2898 ఏడీ మేకర్స్ తీరుతో చిరంజీవి అభిమానులు అప్సెట్.. కారణమిదేనట..!
They Call Him OG | పవన్ కల్యాణ్ బ్యాక్ టు సెట్స్.. ఓజీ షూట్ డేట్ ఫిక్సయినట్టే..?