They Call Him OG | టాలీవుడ్ యాక్టర్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఏపీ డిప్యూటీ సీఎంగా అభివృద్ధి పనులపై ఫోకస్ పెట్టారని తెలిసిందే. అభిమానులు మాత్రం సినిమాల అప్డేట్స్ కోసం ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 2న పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు ట్రీట్ ఇవ్వనున్నాడన్న ఇప్పటికే ఓ వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది. సుజిత్ దర్శకత్వంలో నటిస్తోన్న ఓజీ (They Call Him OG) మేకింగ్ వీడియోను రిలీజ్ చేయబోతున్నారని వార్తలు తెరపైకి వచ్చాయి.
కాగా ఇప్పుడు పవన్ కల్యాణ్ ఓజీ షూట్లో జాయిన్ టైం గురించి మరో అప్డేట్ ఫిలింనగర్ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
లేటెస్ట్ టాక్ ప్రకారం పవన్ కల్యాణ్ తన పుట్టినరోజు తర్వాత ఓజీ చిత్రీకరణను పూర్తి చేసేందుకు తన కాల్షీట్లు కేటాయించనున్నాడన్న వార్త ఒకటి అభిమానులను ఫుల్ ఖుషీ చేస్తోంది. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే సెప్టెంబర్ 3 నుంచే పవన్ కల్యాణ్ ఓజీ సెట్స్‌లో జాయిన్ కాబోతున్నాడట. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదే నిజమైతే అభిమానులకు పండగే అని చెప్పాలి.
మరోవైపు పవన్ కల్యాణ్ టైటిల్ రోల్లో నటిస్తోన్న హరిహరవీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ కొత్త పోస్టర్లను కూడా బర్త్ డే సందర్భంగా విడుదల చేసే ప్లాన్ చేస్తున్నట్టు ఇన్ సైడ్ టాక్. కాగా పవన్ కల్యాణ్‌కు గ్రాండ్ సక్సెస్ అందించిన ల్యాండ్ మార్క్ మూవీ గబ్బర్ సింగ్ 4K వెర్షన్‌ను కూడా రీరిలీజ్ చేయబోతున్నారట.
ఇదిలా ఉంటే మేకర్స్ ఇప్పటికే షేర్ చేసిన ఉస్తాద్భగత్ సింగ్ గ్లింప్స్‌తోపాటు ఓజీ Hungry cheetah వీడియోలు గూప్‌బంప్స్ తెప్పిస్తూ అభిమానులు ఆశించే అన్ని ఎలిమెంట్స్ ఉండబోతున్నట్టు క్లారిటీ ఇచ్చేశాయి. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న హరిహరవీరమల్లు టీజర్ కూడా సినిమాపై అంచనాలు పెంచేస్తోంది.
Jailer 2 | తలైవా జైలర్ 2 లోడింగ్ గురూ.. నెల్సన్ దిలీప్‌కుమార్ సీక్వెల్ మూవీకి టైటిల్ ఫిక్స్..!